English   

ఆచార్య కథ కాపీ...క్లారిటీ ఇచ్చిన ప్రొడక్షన్ హౌస్

 Acharya
2020-08-28 11:19:05

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ఆచార్య. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ సినిమా మీద భారీ ఆంచనాలున్నాయి. అయితే ఈ సినిమా ఎందుకో కానీ బాగా లేటయిందని చెప్పచ్చు. అందుకేనేమో ఇది పూర్తవగానే చేయడానికి ఇప్పటి నుండే వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు. ఇప్పటికే ఆయన ముగ్గురు దర్శకులను తన నెక్స్ట్ మూవీ కొరకు లైన్ లో పెట్టారు. అయితే ఈ ఆచార్య ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ ను ఇటీవలే చిరు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయగా దానికి భారీ రెస్పాన్స్ వచ్చింది.అప్పటి నుండే ఈ సినిమా మీద కాపీ మారక కూడా పడింది. ఈ సినిమా కధ నాదని ఒక వ్యక్తి మీడియాకి ఎక్కాడు. 

అయితే సైలెంట్ గా ఉంటుందని అనుకున్న నిర్మాణ సంస్థ మాట్ని ఎంటెర్టైనెంట్స్ ఒక అధికారిక ప్రెస్ నోట్ ను విడుదల చేసి తెలిపారు. ఈ సినిమాకి సంబంధించిన కథ పూర్తిగా దర్శకుడు కొరటాల శివ  రాసుకున్నారని అలాంటిది ఆయన కాపీ కొట్టారని వస్తున్న వదంతులు అన్ని బేస్ లెస్ అని ఖరాఖండీగా చెప్పేసారు. అలాగే ఇవన్నీ కేవలం డీఫేమ్ చెయ్యడానికే చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవి కానుకగా అందివ్వాలని ప్లాన్ చేస్తున్నారు. 

More Related Stories