English   

మా కుటుంబానికి ప్రాణ హాని రియా ఆరోపణలు

Rhea Chakraborty
2020-08-28 13:15:02

సుశాంత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి బ్యాంకు బ్యాలెన్స్ మీద ఈడీ దృష్టి సారించిందా...? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. రియా చక్రవర్తి బ్యాంకు ఖాతా ఉన్న బ్యాంక్ కి సంబంధించి ముంబైలోని వకోలా బ్రాంచ్ కి ఈడీ అధికారులు రియా చక్రవర్తి తండ్రితో కలిసి వెళ్ళారు. ఈ సందర్భంగా బ్యాంకులో రియా లావాదేవీలు అన్నీ కూడా బయటకు లాగుతున్నట్టు తెలుస్తుంది. ఇక సుశాంత్ సింగ్ ఖాతా నుంచి రియా ఖాతాకు నగదు బదిలీ అయిందనే ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. రియాకు ఇప్పటికే సిబిఐ కూడా సమన్లు జారీ చేసింది. ప్రధానంగా 15 కోట్లకు సంబంధించి రియాను ఈడీ టార్గెట్ చేసిందని అంటున్నారు. 

సుశాంత్ సింగ్ తండ్రి ఈ డబ్బు విషయంలో గతంలో కొన్ని ఆరోపణలు చేసారు. వాటి మీద ఎక్కువగా విచారణ చేస్తుంది ఈడీ. త్వరలోనే రియాను అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేప‌థ్యంలో గురువారం రియా సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేసిన వీడియో సంచ‌ల‌నంగా మారింది. స‌ద‌రు వీడియోలో ఇంటిలోపలికి వ‌స్తున్న రియా తండ్రిని మీడ‌యా చుట్టుముట్ట‌డం, వారిని త‌ప్పించుకుని రియా తండ్రి లోప‌లికి రావ‌డం క‌నిపిస్తోంది. ఈ వీడియోని షేర్ చేసిన రియా త‌మ కుటుంబానికి హాని వుంద‌ని, త‌మ‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని, అలా ర‌క్ష‌ణ క‌ల్పిస్తే విచార‌ణ‌కు తాము స‌హ‌క‌రిస్తాన‌ని పేర్కొంది. ఇప్పుడు ఈ కామెంట్స్ ప్రాధాన్యత‌ సంత‌రించుకున్నాయి. 

More Related Stories