English   

తెలుగు బిగ్ బాస్ తాజా ఫైనల్ లిస్టు ఇదే 

Bigg Boss Telugu 4
2020-08-28 13:46:19

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4 ఎప్పుడు మొదలు కానుందో తెలిసి పోయింది. అక్కినేని నాగార్జున మళ్లీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో కోసం 16 మందిని ఎంపిక చేశారు. వారికి కరోనా సోకకుండా హైదరాబాద్‌ పార్క్ హయత్ హోటల్లో ఉంచారు. అయితే వీరిలో గాయకుడు నోయల్ సేన్ ఉన్నాడు. అతనితోపాటు ముగ్గురికి కరోనా సోకిందని వార్తలు వచ్చాయి. వీటిని నోయల్ ఖండించాడు కానీ ఈ షోలో పాల్గొంటున్నదీ లేనిదీ మాత్రం చెప్పలేదు. అయితే ఈ షోలో పాల్గొంటున్న 16మందికి మరో నలుగురిని ఎక్కువే ఎంపిక చేస్తున్నారని అంటున్నారు. ఒకవేళ షో మొదలు అయ్యే ముందు జరిగే కరోన పరీక్షలో ఎవరికి అయినా కరోనా సోకితే వారిని తప్పించి మిగతా ఉన్నవారిని లోపలకి పంపనున్నారు.

ఈ షో కోసం హోటల్లో ఉన్న వారి వివరాలు ఇలా ఉన్నాయి. నాగవల్లి (టీవీ9 యాంకర్), అరియానా గ్లోరీ (మన స్టార్స్ యూట్యూబ్ చానల్ యాంకర్), మహబూబ్ దిల్సే (టిక్ టాకర్), జోర్దార్ సుజాత (హెచ్ఎంటీవీ యాంకర్), సొహైల్ రియాన్ (నటుడు), లాస్య (యాంకర్), కరాటే కల్యాణి (నటి), నోయెల్ సేన్ (గాయకుడు), ముక్కు అవినాశ్( నటుడు), దేత్తడి హారిక (యూట్యూబర్), గంగవ్వ (యూట్యూబర్), అభిజిత్ (నటుడు - లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేం), అమ్మ రాజశేఖర్ (దర్శకుడు), రఘు మాస్టర్ - సింగర్ ప్రణవి దంపతులు, మెనాల్ గజ్జర్(నటి) ఉన్నారు. షెడ్యూలు ప్రకారం ఈ నెల 30న తొలి ఎపిసోడ్ ప్రసారం కావాల్సి ఉంది. ముగ్గురు కంటెస్టెంట్లకు కరోనా సోకడంతో వచ్చే నెల 6న ఆదివారం తొలి ఎపిసోడ్ వస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.  

More Related Stories