English   

ప్రభాస్ కూడా ఇంటి నుండేనా 

Prabhas
2020-08-28 21:47:35

సాహో తరువాత చాలా గ్యాప్ తీసుకున్న ప్రభాస్ జిల్ రాధా కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పేరు జాన్ అని లేదు రాధే శ్యాం అని ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే ఎట్టకేలకి ఈ సినిమా పేరును యూనిట్ ఫైనల్ చేసింది. ముందు నుండి ప్రచారం జరిగినట్టుగానే రాధే శ్యామ్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో విదేశాల్లో షూటింగ్ చేసే పరిస్థితి లేకపోవటంతో హైదరాబాద్‌ లోనే అక్కడి సెట్స్‌ నిర్మిస్తున్నారు.  అయితే ఈ సినిమా షూట్ త్వరలోనే మొదలు కానున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అది నిజమేనని సినిమా డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత ఆయన నాగ్ అశ్విన్ తో సినిమా చేస్తున్నారు. ఆ తరువాత ఆయన బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ దర్శకత్వంలో ఆది పురుష్‌ అనే ప్యాన్‌ ఇండియా సినిమాని అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్‌ విలు విద్య నేర్చుకోనున్నారని, బాడీని కూడా అందుకు తగ్గట్టుగా మార్చుకోనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన శిక్షణను త్వరలోనే ప్రారంభించనున్నట్టు చెబుతున్నారు. విలు విద్యకు సంబంధించిన సెటప్‌ను ప్రభాస్‌ తన ఇంటి ఆవరణలోనే ఏర్పాటు చేసుకోనున్నారని చెబుతున్నారు. ఈ శిక్షణ అంతా ఇంట్లోనే పూర్తి చేస్తారని చెబుతున్నారు.  

More Related Stories