English   

కూతుర్ని పరిచయం చేసిన స్నేహ

Sneha
2020-08-29 13:02:05

టాలీవుడ్ లో హోమ్లీ హీరోయిన్ అంటే సౌందర్య తర్వాత వెంటనే గుర్తొచ్చే పేరు స్నేహ. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో కనిపించి అందరినీ అలరించింది. కెరీర్ మంచి ఫామ్ లో వున్నప్పుడే త‌మిళ న‌టుడు ప్ర‌స‌న్న‌ని వివాహం చేసుకుని సినిమాలకి దూరమయింది. ఈ మధ్యే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆమ ఇప్పుడు కారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తోంది. ఆ మ‌ధ్య విన‌య విధేయ రామ చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్‌కి వ‌దిన‌గా న‌టించిన స్నేహ రీసెంట్‌గా వ‌చ్చిన త‌మిళ చిత్రం ప‌టాస్‌ లో కూడా నటించింది.ఇక ఈ రోజు ప్రసన్న పుట్టిన రోజు కావడంతో తన భర్తకు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ తన కూతురిని కూడా తన అభిమానులకి పరిచయం చేసింది స్నేహ. హ్యాపీ బర్త్ డే మై సోల్ మేట్.. మై లవర్ బాయ్.. మై గార్డియన్.. నా జీవితాన్ని ఇంత అందంగా చేసినందుకు థాంక్స్.. ఈ సందర్భంగా నా కూతురిని ఇంట్రడ్యూస్ చేయడం చాలా సంతోషంగా ఉందని కూతురు ఆద్యంత పిక్ తో సహా పరిచయం చేసింది. 

More Related Stories