English   

కేజీఎఫ్ లో ప్రకాష్ రాజ్ రోల్ అదేనా

Prakash Raj
2020-08-29 19:38:31

యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ సీక్వెల్ కేజీఎఫ్ 2. కె.జి.ఎఫ్ ఏమేరకు సెన్సేషనల్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమా కన్నడలోనే కాక తెలుగు, తమిళ, హింది భాషల్లో కూడా భారీ విజయాన్ని సాధించింది. కె.జి.ఎఫ్‌ సినిమా జోరుతో కె.జి.ఎఫ్‌- చాప్టర్ 2 కూడా అదే రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. మొదటి పార్ట్ కి వచ్చిన క్రేజ్ దృష్ట్యా బాలీవుడ్ సహా కొన్ని బాషలలో కీలకమైన పాత్రల కోసం స్టార్ నటులను ఈ సినిమాలో నటింప చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ మెయిన్‌ విలన్‌ అధీరా పాత్రలో నటిస్తుండటం అలాగే లేడీ ప్రధానమంత్రిగా రవీనా టాండన్‌ నటిస్తుండడంతో ఈ సినిమా మీద ఇంకా అంచనాలు పెరిగిపోయాయి. అయితే కరోనా లేకుండా ఉండి ఉంటే ఈ పాటికి టీజర్ కూడా వచ్చేసి ఉండేది. అయితే గత రెండు రోజుల కితమే షూటింగ్ మొదలు కాబడిన ఈ చిత్రంకు సంబంధించి ఒక అంశం హాట్ టాపిక్ లా మారింది. అదేంటంటే ఈ సినిమా షూటింగ్ ప్రకాష్ రాజ్ మీదనే మొదలు కావడంతో మొదటి భాగంలో ఒక రిపోర్టర్ గా కనిపించిన అనంత్ నాగ్ రోల్ ను ఈయనతో రీప్లేస్ చేస్తున్నారని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు దీనికి సంబంధించి మరో వార్త వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ రోల్ పూర్తిగా కొత్తదని అంటున్నారు. అలానే ఈ రోల్ సెకండ్ పార్ట్ కు రిలేటెడ్ అని అంటున్నారు.  

More Related Stories