బాలయ్య సినిమా కోసం స్పెషల్ సెట్ వేస్తున్నరాట

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటితో కలిసి ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు మంచి విజయం సాధించడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే బోయపాటి తాజా ప్రాజెక్ట్‌కి సంబంధించి ఆసక్తికర వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అందుకో నిజం ఎంతుందో తెలియదు కానీ ఈ సినిమా గురించిన కొన్ని పుకార్లు భీబత్సంగా హల్చల్ చేస్తున్నాయి. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సినిమాల్లో హీరో ఎంత బలంగా ఉంటాడో.. విలన్ కూడా అంతే బలంగా, పొగరుగా ఉంటాడు. అందుకే, ఆయన సినిమాల్లో హీరో పాత్రలు బాగా ఎలివేట్ అవుతాయి.
గతంలో బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో ప్రతినాయకుడిగా వివేక్ ఒబెరాయ్ నటించారు. ఇప్పుడు బాలయ్యకి విలన్‌గా కూడా ఈయన్నే ఎంపిక చేయాలని మేకర్స్ భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ విషయం ఎలా ఉన్నా ఈ సినిమా వచ్చే నెల నుండి షూటింగ్ కి రెడీ అవుతోన్నట్లు ప్రచారం జరుగుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని సీన్స్ షూట్ చేయనున్నారని అంటున్నారు. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఒక కీలక షూటింగ్ షెడ్యూల్ కై రామోజీ ఫిల్మ్ సిటీ లో ఒక స్పెషల్ సెట్ ను చిత్ర యూనిట్ రూపొందిస్తుందని అంటున్నారు. ఈ మూవీకి పలు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.