English   

ఈసారి కొత్త జానర్ తో సతీష్ వేగేశ్న కోతికొమ్మచ్చి అంటూ 

Satish Vegesna
2020-08-31 14:39:41

డైరెక్ట‌ర్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీహరి తనయుడు మేఘాంష్, సతీష్ వేగేశ్న తనయుడు సమీర్ వేగేశ్న హీరోలుగా కొత్త సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. మొన్న దివంగత శ్రీహరి జయంతి సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. అయితే అప్పటికి ఇంకా టైటిల్ ప్రకటించలేదు, కానీ నిన్న స‌తీష్ వేగేశ్న పుట్టిన‌రోజు కావడంతో ఆ సందర్భంగా.. ఈ చిత్రానికి ‘కోతి కొమ్మ‌చ్చి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు. శతమానం భవతి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న సతీష్ వేగేశ్న రెండో సినిమాగా తీసిన శ్రీనివాస కళ్యాణం భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఆయనకు ఆఫర్స్ రావడం కష్టంగా మారింది. చివరికి సొంత కొడుకునే హీరోగా లాంచ్ చేసుకుంటున్నాడు. 

ఈ సినిమాని ‘లక్ష్య ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ఎమ్.ఎల్.వి సత్యనారాయణ నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. కరోనా ప్రభావం కాస్త తగ్గిన తర్వాత షూటింగ్ ను మొదలు పెట్టాలని యూనిట్ భావిస్తున్నారు. ఇప్పటిదాకా శతమానం భవతి, శ్రీనివాస కళ్యాణం, ఎంత మంచి వాడవురా లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్, కుటుంబ విలువలతో సినిమాలు తీసిన సతీష్ వేగ్నేశ ఇప్పుడు యూత్ ఫుల్ ఎంటర్టైన్ మెంట్ సినిమా తీస్తుండడంతో సిఇమా మీద అంచనాలు బాగానే నెలకొన్నాయి. 

More Related Stories