English   

మహేష్ ఫ్లాప్ మూవీ బాలీవుడ్ వాళ్ళకి అంత నచ్చిందా 

mahesh babu
2020-08-31 16:22:20

ఈ మధ్య తెలుగు సినిమాలకి బాలీవుడ్ లో మంచి ఆదరణ లభిస్తోంది. కొన్ని సినిమాలని రీమేక్ చేస్తుండగా మరికొన్నిటిని మాత్రం హిందీ డబ్బింగ్ చెప్పించి డిజిటల్ ఫ్లాట్ ఫాంలలో విడుదల చేస్తున్నారు. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరయిన మహేష్ బాబు సినిమాలు యూట్యూబ్ తదితరాల కోసం ఇతర భాషల్లో డబ్ అవుతుంటాయి. ఈ మధ్యన తాజాగా రామ్ నటించిన మూడు సినిమాలు యూట్యూబ్ లో 100 మిలియన్ల వ్యూస్ సాధించి అద్భుతమైన రికార్డు సొంతం చేసుకోగా ఇప్పుడు అదే బాటలో నితిన్ కూడా నడుస్తున్నారు. తాజాగా ఆదిత్య మ్యూజిక్ వాళ్ళ ఆదిత్య మూవీస్ యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన నితిన్ న‌టించిన సూప‌ర్ హిట్ సినిమాలు అఆ, చ‌ల్ మోహ‌న్ రంగ‌, శ్రీనివాస క‌ళ్యాణం హిందీ డ‌బ్ వెర్ష‌న్ కు ఓవ‌ర్ ఆల్ గా 400 మిలియ‌న్ల వ్యూస్ రాబట్టినట్టు తేలింది. 

ఇక గత కొంతకాలంగా మహేష్ బాబు సినిమాలు హిందీ బాషలోనే పంజాబ్ లో కూడా రిలీజ్ అవుతున్నాయి. మహేష్ గత చిత్రం భరత్ అనే నేను పంజాబ్ లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా పంజాబ్ లో కూడా విజయాన్ని నమోదు చేయడంతో పంజాబీలు సైతం మహేష్ పై అభిమానం పెంచుకున్నారు. అయితే మహేష్ కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా చేపుకునే  “1 నేనొక్కడినే” సినిమాకు ఇప్పుడు భారీ రెస్పాన్స్ వచ్చింది. దీనిని హిందీలో డబ్ చేసి విడుదల చేస్తుంటారుగా అలాగే దీనిని కూడా చెయ్యగా దానికి ఏకంగా 100 మిలియన్ వ్యూస్ వచ్చి పడ్డాయి. దీనితో మహేష్ ప్లాప్ తో రికార్డు స్థాయి వ్యూస్ ను అందుకొని అదరగొట్టారని చెప్పొచ్చు.   

More Related Stories