English   

అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ టబు దగ్గరకే నితిన్ బాలీవుడ్ రీమేక్ 

Nithiin
2020-08-31 17:32:46

కుర్ర హీరో నితిన్‌ ప్రస్తుతం వరుస సినిమాలు అనౌన్స్ చేసి మంచి ఫాంలో ఉన్నాడు. మొన్ననే పెళ్లి చేసుకున్న నితిన్ భీష్మతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో భీష్మతో పాటే వెంకీ అట్లూరి, చంద్రశేఖర్‌ యేలేటి, కృష్ణ చైతన్యలతో సినిమాలు కూడా ఓకే చేశాడు. ఇక తాజాగా ఆయన మేర్లపాక గాంధీతో ‘అంధాదున్‌’ రీమేక్‌ కూడా పట్టాలెక్కించాడు. మొన్నామధ్య పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది కూడా. అయితే లాక్‌డౌన్‌ కారణంగా రెగ్యులర్‌ షూటింగ్‌ మాత్రం జరగడం లేదు. ఇక ఈ సినిమా మాతృక ప్రకారం ఈ సినిమాలో విలన్‌ ఓ లేడీ. మాతృకలో ఈ పాత్రను టబు అద్భుతంగా నటించింది. అందుకే ఇప్పుడు తెలుగు రీమేక్‌లోనూ ఆ పాత్రను ఆమెతోనే చేయించాలని నితిన్ సినిమా యూనిట్ కూడా ప్రయత్నించినట్లు అయితే రెమ్యునరేషన్ కుదరక వదిలేశారని ప్రచారం జరిగింది.  

అయితే ఆ పాత్రలో ఒకప్పటి హీరోయిన్ శిల్పా శెట్టి నటించనుందని ఒకసారి లేదు రమ్య కృష్ణను ఎంపిక చేశారని ఒకసారి కాదు, ప్రియమణి, శ్రియా లాంటి వాళ్ళ పేర్లు కూడా గట్టిగా వినిపించాయి. కానీ ఎవరూ ఈ సినిమాని, ఆ పాత్రను చేయడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే అది నెగటివ్ క్యారెక్టర్ కాబట్టి, ఈ క్రమంలో కాస్టింగ్ విషయం మళ్ళీ మొదటికి వచ్చినట్లైంది. అయితే చివరికి మళ్ళీ టబు దగ్గరికే ఈ రీమేక్ వేల్ల్న్దని అంటున్నారు. కాకపోతే ఈ చిత్రానికి పెద్ద మొత్తంలో డబ్బును డిమాండ్ చేస్తోందట టబు. అయినా సరే ఆమెకు ఇవ్వడానికి రెడీ అయ్యారని చెబుతున్నారు.  
 

More Related Stories