English   

ప్రభాస్ తో చిందేయనున్న పూరీ హీరోయిన్ 

Prabhas nag ashwin
2020-08-31 20:28:30

సవ్యసాచి చిత్రంతో తెలుగులో హీరోయిన్ గా తెరంగ్రేటం చేసింది నిధి అగర్వాల్. తన అందచందాలతో యూత్ ని బాగానే ఎట్రాక్ట్ చేసిన నిధి సవ్యసాచి అయిన వెంటనే మిస్టర్ మజ్ను సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమాలో తన గ్లామర్ తో ఆకట్టుకున్నా కానీ హిట్ మాత్రం దక్కలేదు. అయితే పూరీ జగన్నాథ్ ఈ హాట్ బ్యూటీ గ్లామర్ ని ఇస్మార్ట్ శంకర్ లో మరింతగా ఎలివేట్ చేశాడు. అదీ కాక ఆ సినిమాతో ఈ భామకి మొదటి హిట్ కూడా దక్కింది. అయితే ఎద అందాలను ఆరబోయడంలో నిధి ఎక్స్ పర్ట్ అని చెప్పచ్చు. ఇక ఈ అందాల నిధిని వాడుకోవడానికి ప్రభాస్ 21 మూవీ మేకర్స్ సిద్దం అయినట్టు చెబుతున్నారు. 

అదేంటంటే అశ్వినీ దత్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ తో ఒక భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కిస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 200 కోట్ల బడ్జెట్‌తో పాన్‌ ఇండియన్ మూవీగా తెరకెక్కుతోన్నది.  ఇక ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన  దీపికా పదుకొన్ కథానాయికగా నటించనున్నట్లు అధికారికంగా వైజయంతీ మూవీస్ ప్రకటించింది కూడా. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి మరో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉండనుందని అందుకే ఆమె కోసం ఇప్పటికే వేట ప్రారంభించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ పాత్ర కోసం నివేద థామస్ ని తీసుకోవాలని చూస్తున్నారట. అది కాక ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం నిధిని అడిగారట. ఇందులో నిజం ఎంత ఉందనేది తెలియాల్సి ఉంది.

More Related Stories