English   

ఈ ఏడాది థియేటర్లు లేనట్టే... మరి వాళ్ళ పరిస్థితి ఏంటో 

Tollywood
2020-09-01 14:54:01

థియేటర్ రిలీజ్ మాత్రమే చేస్తామని చెప్పిన సినిమాలు కూడా ఓటీటీకి వెళ్లిపోతున్నాయి. ల్యాండ్ మార్క్ మూవీస్ ఇవి ఎలా అయినా సినిమాహాల్లోనే రిలీజ్ చేస్తానని కూర్చున్న హీరోలు కూడా పరిస్థితులకు తగ్గట్టు డిజిటల్ రిలీజ్ కి ఓకే చెప్తున్నారు. చాలామంది స్టార్ హీరోలు ఈ ఏడాది చివర్లో తమ సినిమాలని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేస్తున్నారు. సో వీళ్ల ప్రకటనలు చూస్తోంటే 2020లో థియేటర్లు తెరుచుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. అంటే ఈ ఏడాది థియేటర్ బిజినెస్ అంతా కరోనాలో కలిసిపోతోందా? అంటే అవుననే అంటున్నారు. లాక్ డౌన్ లో కరోనా కొంచెం కంట్రోల్ లో ఉన్నట్లు కనిపించగానే సినిమా షూటింగులకి పర్మిషన్లు కూడా తీసుకున్నారు దర్శకనిర్మాతలు. అయితే లాక్ డౌన్ ఎత్తెయ్యగానే పరిస్థితులు మారిపోయాయి. వందలు వేల నుంచి కరోనా కేసులు లక్షల్లోకి వెళ్లిపోయాయి. దీంతో ఇప్పుడు సినిమాహాళ్లు తెరుచుకోవడం కష్టమని, తెరుచుకున్నా మినిమం ఆక్యుపెన్సీ కూడా కష్టమని అభిప్రాయపడుతున్నారు సినీజనాలు.  ఇక థియేటర్ల మూతతో తెలుగు రాష్ట్రాల్లో 80 వేల మందికి పైగా ఉపాధి కోల్పోయారు. దేశవ్యాప్తంగా అయితే 20 లక్షల మంది ఈ ఎఫెక్ట్ పడింది. అందుకే ‘సేవ్‌ సినిమా’ పేరుతో, సపోర్ట్‌ మూవీ థియేటర్స్‌ అంటూ మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సోషల్ మీడియాలో తన వాణిని గట్టిగా వినిపిస్తోంది. ప్రభుత్వాలు షాపింగ్‌ మాల్స్‌కీ, విమానయానాలు, మెట్రోరైళ్లు ఇతరత్రా ప్రయాణాలకీ అనుమతిచ్చినా థియేటర్లకి అనుమతి ఇవ్వకపోవడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. 

More Related Stories