English   

నాన్నను స్మరించుకున్న జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్..

Jr NTR
2020-09-02 12:23:18

సెప్టెంబర్ 2 అంటే చాలా మందికి పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అని మాత్రమే తెలుసు. కానీ అదే రోజు నందమూరి హరికృష్ణ జయంతి కూడా. రెండేళ్ల కిందట ఆయన ఆక్సిడెంట్ లో మరణించడం నందమూరి అభిమానులకు అతి పెద్ద షాక్. అప్పటి వరకు ప్రతి ఏడాది అభిమానుల సమక్షంలో హరికృష్ణ జన్మదిన వేడుకలు జరిగేవి. కానీ ఇప్పుడు ఆయన జయంతి జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ బాధ పడుతున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే నందమూరి హరికృష్ణ 64వ జయంతి సందర్భంగా ఆయన తనయులు సోషల్ మీడియా వేదికగా నాన్నను గుర్తు చేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. మరోవైపు కళ్యాణ్ రామ్ కూడా తండ్రిని స్మరించుకున్నాడు. "ఈ అస్తిత్వం మీరు. ఈ వ్యక్తిత్వం మీరు..మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ప్రస్థానానికి నేతృత్వం మీరు . ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే అంటూ పోస్ట్ చేశాడు నందమూరి కళ్యాణ్ రామ్. "మీ 64వ జయంతి న మిమ్మల్ని స్మరించుకుంటూ.... Miss You Nanna!" అని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. పలువురు నందమూరి అభిమానులు కూడా సోషల్ మీడియాలో హరికృష్ణని గుర్తు చేసుకున్నారు. పలువురు తెలుగుదేశం నేతలు కూడా పార్టీకి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.

More Related Stories