పవన్ కళ్యాణ్ అభిమానుల మృతి పట్ల రామ్ చరణ్ స్పందన..

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి కోవిడ్ కారణంగా జన సమూహాలు ఉండకూడదు కాబట్టి సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానుల రచ్చ ఓ రేంజ్ లో జరుగుతుంది ఇదిలా ఉంటే బయట కూడా ఈయన బ్యానర్లు కట్టడం పాలాభిషేకం చేయడం జరుగుతున్నాయి ఈ క్రమంలోనే అనుకోకుండా ఒక దుర్ఘటన జరిగింది కుప్పం సమీపంలోని శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో భారీ కటౌట్ ఏర్పాటు చేస్తున్న క్రమంలో కరెంట్ షాక్ తగిలి ముగ్గురు యువకులు మృతి చెందారు. మొత్తం 10 మంది విద్యుదాఘాతానికి గురి కాగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనపై పవన్కళ్యాణ్ వెంటనే స్పందించాడు.
ఇకపై ఆ కుటుంబాలకు కొడుకును నేనే అంటూ చెప్పుకొచ్చాడు తక్షణ సహాయం కింద రెండు లక్షలు ప్రకటించాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ ఘటనపై రామ్ చరణ్ స్పందించాడు. కుప్పంలో జరిగిన దుర్ఘటనలో ముగ్గురు యువకులు మరణించారనే వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపాడు. మీ ఆరోగ్యం, ప్రాణం కంటే ఏది విలువైనది కాదు.. మీరు ఎల్లప్పుడు ఇది గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని అభిమానులను సూచించాడు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ వాళ్ళు కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశాడు చరణ్. కాగా ఈ ఘటనపై చంద్రబాబు నాయుడు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు.