English   

బిగ్ బాస్ లో కరోనా కల్లోలం.. తల పట్టుకున్న నిర్వాహకులు..

 Bigg Boss Telugu 4
2020-09-02 12:50:12

మరో నాలుగు రోజుల్లో బిగ్ బాస్ 4 తెలుగు సీజన్ మొదలు కాబోతుంది. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. కంటెస్టెంట్స్ ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. ఎవరిని ఎంపిక చేశారు అనేది ఇప్పటి వరకు క్లారిటీ గా తెలియదు. సోషల్ మీడియాలో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. కానీ దానిపై క్లారిటీ లేదు. సెప్టెంబర్ 6 నుంచి బిగ్ బాస్ మొదలవుతుంది అంటూ ఇప్పటికే ప్రోమోలు కూడా విడుదల చేశారు మా టీవీ యాజమాన్యం. 16 మంది కంటెస్టెంట్స్ ఎంపిక చేసి హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హోటల్లో క్వారంటైన్ చేశారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్లోకి కూడా వచ్చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. 

సింగర్ నోయల్ కరోనా బారిన పడినట్లు వారం రోజుల కింద వార్తలు వచ్చాయి. ఆయనతో పాటు యూట్యూబ్ గంగవ్వ.. మరో ఇద్దరికి కూడా కరోనా పాజిటివ్ ఉన్నట్లు తాజా సమాచారం. మరో నాలుగు రోజుల్లో షో మొదలుకానున్న నేపథ్యంలో కంటెస్టెంట్ లు ఇలా కరోనా బారిన పడటంతో తల పట్టుకుంటున్నారు నిర్వాహకులు. మొదట్లోనే పరిస్థితి ఇలా ఉంటే తర్వాత ఎలా ఉంటాయో.. ఎలా మారతాయి తెలియక తికమక పడుతున్నారు. అయితే ఒక్కటి మాత్రం నిజం. పాజిటివ్ వచ్చిన కంటెస్టెంట్ మళ్లీ నెగిటివ్ అని తేలిన తర్వాతే ఇంట్లోకి అడుగు పెడతారు. లేదంటే వాళ్ళ సొంత ఇంటికి వెళ్లిపోతారు. ఈ విషయంలో మాత్రం షో నిర్వాహకులు గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తుంది. ఏదైనా కరోనా సమయంలో బిగ్ బాస్ లాంటి భారీ రియాల్టీ షో అనుకున్నది అనుకున్నట్లు చేయడం కాస్త కష్టమైన పనే. దాన్ని సక్సెస్ చేసి చూపించాలని మా టీవీ టీం కష్టపడుతుంది. 

More Related Stories