English   

చిరంజీవి ఇంక మారడా.. ఎందుకు అంత భయం భయం..

chiranjeevi
2020-09-02 17:46:37

అదేంటి.. చిరంజీవికి ఏంటి భయం అనుకుంటున్నారా..? ఇఫ్పుడు ఈయన చేస్తున్న సినిమాలు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. ఖైదీ నెం 150 సినిమాతో చిరంజీవి పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తే అంతా సంతోషించారు. 150వ సినిమా కోసం రెండేళ్లకు పైగానే చూసి.. ఎన్నో కథలు విని.. ఎవరిపై నమ్మకం లేక చివరికి కత్తి లాంటి రీమేక్ కథను అరువు తెచ్చుకున్నాడు చిరంజీవి. ఆ తర్వాత సైరాతో తెలుగు ప్రేక్షకులను మాత్రమే మెప్పించాడు. 

ఇప్పుడు ఆచార్యతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత మరో మూడు సినిమాలు కూడా లైన్‌లో ఉన్నాయి. అంతా బాగానే ఉంది.. చిరంజీవి కెరీర్ ఇప్పుడు బుల్లెట్ స్పీడ్‌లో దూసుకుపోతుంది. అది చూసి అంతా హ్యాపీగానే ఉన్నారు. కానీ ఒక్క విషయంలో మాత్రం చాలా మంది దర్శకులు నిరుత్సాహపడుతున్నారు. దానికి కారణం చిరంజీవికి సొంత కథలపై నమ్మకం లేకపోవడం. ఎక్కువగా రీమేక్ సినిమాలపైనే ఆధారపడుతున్నాడు మెగాస్టార్.ఇదే విమర్శలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. రీ ఎంట్రీ కోసం కాబట్టి కత్తిని నమ్ముకున్నాడు. కానీ ఇప్పుడు వేదాళం, లూసీఫర్ అంటూ వరస రీమేక్స్ సైన్ చేసాడు చిరంజీవి. మెగాస్టార్ లాంటి హీరో ఇలా వరస రీమేక్స్ చేయడం ఏంటి అంటూ విమర్శలు వస్తున్నాయి.

తెలుగులో ఎంతో గొప్ప గొప్ప దర్శకులతో పాటు రైటర్స్ కూడా ఉన్నారు. చిరు ఔనంటే ఆయన ఇమేజ్‌కు సరిపోయే కథలు రాస్తారు. కానీ మెగాస్టార్ మాత్రం సొంత కథలు చేసే ధైర్యం చేయలేకపోతున్నాడు. సైరా చరిత్ర.. ఇప్పుడు ఆచార్య మాత్రమే చిరు చేస్తున్న స్ట్రెయిట్ సినిమా. అది కూడా కొరటాల శివ లాంటి దర్శకుడు కాబట్టి ధైర్యంగా ముందడుగేస్తున్నాడు. లేదంటే అది కూడా సాధ్యమయ్యేది కాదేమో..? ఆ తర్వాత వరసగా రీమేక్ సినిమాలే లైన్‌లో ఉన్నాయి. ఇప్పుడు కానీ చిరు ఈ లైనప్ మార్చుకోకపోతే కచ్చితంగా మరిన్ని విమర్శలు తప్పవు. మరి ఇది అన్నయ్య ఎంతవరకు వింటాడు అనేది చూడాలి.

More Related Stories