English   

బాలీవుడ్ సీనియర్ నటుడి ఇంట తీవ్ర విషాదం.. పది రోజుల్లో ఇద్దరు

Dilip Kumar
2020-09-03 09:42:20

బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరుడు ఇషాన్‌ ఖాన్ కరోనాతో నిన్న సాయంత్రం కన్నుమూశారు. ఆయన వయసు ప్రస్తుతం 92 సంవత్సరాలు.  ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కరోనా వైరస్ సంబంధిత సమస్యలతో కన్నుమూసినట్టు లీలావతి ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ జలీల్ పార్కర్ ప్రకటించారు. ఆయనకు కరోనా సోకిందని, అలాగే, గుండె సంబంధిత సమస్యలతోపాటు హైపర్ టెన్షన్, అల్జీమర్స్‌తో బాధపడుతున్నట్టు డాక్టర్ తెలిపారు. కాగా, ఆగస్టు 21న దిలీప్ కుమార్ మరో సోదరుడు అస్లామ్ ఖాన్ కూడా లీలావతి ఆసుపత్రిలోనే కరోనాతో కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న దిలీప్ సోదరులు ఇద్దరికీ ఆక్సిజన్ స్థాయులు తగ్గిపోవడంతో ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆగస్టు 21న ఒకరు కన్నుమూయగా నిన్న ఒకరు కన్నుమూశారు.  

More Related Stories