English   

చర్చనీయాంశంగా పవన్ రిప్లైలు.. తమ్ముడు మనోజ్, సత్యదేవ్ సినిమా అంటూ 

pawan kalyan
2020-09-03 09:48:47

నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో సినీ తారలు సహా అందరి నుండి ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆయన కూడా సెలబ్రిటీలలో చిన్నా పెద్దా అని తేడా లేకుండా తనకు విష్ చేసిన ప్రతీ ఒక్కరికీ పవన్ రిప్లై ఇచ్చారు. అలా రిప్లై అందుకున్న వారిలో అత్తారింటికి దారేదిలో తన చేతిలో దెబ్బలు తిన్న చిన్న క్యారెక్టర్ చేసిన హీరో సత్యదేవ్ కూడా ఒకరు. అయితే విషెస్ అందించి ఊరుకోకుండా, ఆయన నటించిన సినిమా కూడా బాగుందని పేర్కొన్నారు పవన్. సత్యదేవ్ గారు. మీ లేటెస్ట్ ఫిలిం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాలోని మీ నటనకు నేను ఎంతగానో ఎంజాయ్ చేశాను. ఆల్ ది బెస్ట్’’ అని ట్వీట్‌లో స్పందించారు. 

ఈయన లానే మహేష్ బాబు, రవితేజ, వెంకటేష్, నాని, మోహన్‌లాల్, మంచు మనోజ్, సుధీర్ బాబు, సునీల్, చాలా మంది సినీ ప్రముఖులకు పవన్ రిప్లై ఇచ్చారు. ప్రతి ఒక్కరికీ ఎంతో మర్యాదగా కృతజ్ఞతలు తెలిపారు. అయితే, మంచు మనోజ్‌కు మాత్రం ప్రత్యేకంగా ‘‘తమ్ముడు మనోజ్‌కి బంగారు భవిష్యత్తు రావాలని కోరుకుంటున్నాను’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈయన కాక పవన్ కళ్యాణ్ ఇచ్చిన రిప్లైకి యంగ్ హీరో కార్తికేయ సర్‌ప్రైజ్ అయ్యారు. దీనికా కారణం ఉంది. కార్తికేయను పవన్ కళ్యాణ్ ‘సార్’ అని సంబోధించారు. దీంతో కార్తికేయ ఆశ్చర్యపోయి రిప్లై ఇచ్చారు. 

‘‘సార్ సార్ సార్.. సర్ ఏంటి సార్.. మీకు ఉన్న కోట్లాది మంది అభిమానుల్లో నేనూ ఒకడిని. మీరు నాకు రిప్లై ఇవ్వడం చాలా గొప్ప విషయం నాకు. మీ బర్త్‌డేకి రిటర్న్‌లో నాకు ఎప్పటికీ మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చారు. థాంక్యూ సార్. నాకు చాలా చాలా సంతోషంగా ఉందని కార్తికేయ ట్వీట్ చేశారు. అయితే బన్నీ విషయంలోనే అందరూ కాస్త ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అందరినీ సార్ సార్ అని సంబోధించిన పవన్, బన్నీని మాత్రం ఒట్టి థాంక్స్ చెప్పి సరిపెట్టాడు. ఎంత అయినా అల్లుడు కదా, అందుకే సార్ అనలేదేమో అని అభిమానులు చర్చించుకుంటున్నారు.
 

More Related Stories