English   

ప్రచారమే నిజమయింది.. ఆయనే ప్రభాస్ కి విలన్ 

Saif Ali Khan
2020-09-03 11:25:21

సాహో తరువాత చాలా గ్యాప్ తీసుకున్న ప్రభాస్ జిల్ రాధా కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పేరు జాన్ అని లేదు రాధే శ్యాం అని ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే ఎట్టకేలకి ఈ సినిమా పేరును యూనిట్ ఫైనల్ చేసింది. ముందు నుండి ప్రచారం జరిగినట్టుగానే రాధే శ్యామ్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమా షూట్ త్వరలోనే మొదలు కానున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అది నిజమేనని సినిమా డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత ఆయన నాగ్ అశ్విన్ తో సినిమా చేస్తున్నారు. ఆ తరువాత ఆయన బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ దర్శకత్వంలో ఆది పురుష్‌ అనే ప్యాన్‌ ఇండియా సినిమాని అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు. ఈ సినిమాలో విలన్ సైఫ్ అలీ ఖాన్ అని ముందు నుండీ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ప్రచారమే నిజం అయింది. ఈ విషయాన్ని చిత్రం బృందం ఈ ఉదయం అధికారికంగా ప్రకటించింది.

'ఆదిపురుష్ గురించి రేపు ఉదయం 7.11 నిమిషాలకు అప్ డేట్ ఇవ్వనున్నామంటూ' నిన్న ప్రభాస్ ప్రకటించిన సంగతి విదితమే. చెప్పినట్టుగానే ఈ ఉదయం అదే సమయానికి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాలో లంకేశ్ పాత్రలో విలన్ గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నట్టు ఓ పోస్టర్ ద్వారా యూనిట్ ప్రకటించింది. సైఫ్ అలీఖాన్ తో కలసి నటించడానికి ఎంతో ఉత్సుకతతో వెయిట్ చేస్తున్నాననీ, అంతటి గొప్ప నటుడితో కలసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఆసక్తిగా వుందని ఈ సందర్భంగా ప్రభాస్ పేర్కొన్నాడు. ఈ సినిమా కోసం ప్రభాస్‌ విలు విద్య నేర్చుకోనున్నారని, బాడీని కూడా అందుకు తగ్గట్టుగా మార్చుకోనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన శిక్షణను త్వరలోనే ప్రారంభించనున్నట్టు చెబుతున్నారు. విలు విద్యకు సంబంధించిన సెటప్‌ను ప్రభాస్‌ తన ఇంటి ఆవరణలోనే ఏర్పాటు చేసుకోనున్నారని చెబుతున్నారు. ఈ శిక్షణ అంతా ఇంట్లోనే పూర్తి చేస్తారని చెబుతున్నారు.  

More Related Stories