బన్నీ సహా వారందరికీ థాంక్స్ చెప్పిన పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సంధర్భంగా కుప్పంలో పవన్ ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ ఘాతానికి గురయ్యి ముగ్గురు అభిమానులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ వార్త పవన్ నే కాదు, యావత్ సినీ ప్రపంచానికి సామాన్య ప్రజలకి సైతం విష్మయానికి గురి చేసింది. ఈ ఘటన జరిగిన వెంటనే బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని పవన్ తన జనసేప తరపున కొంత అమౌంట్ ప్రకటించారు. ఇక పవన్ సినిమాలు చేస్తున్న పలు నిర్మాణ సంస్థలు సహా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు తమ వంతు ఆర్ధిక సాయంతో ముందుకొచ్చారు. దీనితో పవన్ వారికి ముందు గానే ఒకసారి ధన్యవాదాలు తెలిపారు. ఇపుడు మరోసారి వారందరికీ కలిపి ప్రత్యేక కృతజ్ఞ్యతలు తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. “కుప్పం దుర్ఘటనలో గాయపడ్డ వారిని, చనిపోయిన వారి కుటుంబాల్ని ఆదుకోవటానికి ముందుగా మానవతా దృక్పథంతో స్పందించిన శ్రీ రాంచరణ్ కి, అలాగే పెద్దమనుసు తో ముందుకు వచ్చిన శ్రీ అల్లు అర్జున్ కి, నిర్మాతలు శ్రీ దిల్ రాజు, శ్రీ ఏ.ఎమ్ రత్నం, మైత్రి మూవీస్ శ్రీ నవీన్ గార్లకు,నా కృతజ్ఞతలు” అంటూ ట్వీట్ చేసారు.