English   

ఆ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ పవన్ కళ్యాణ్ కలుపుతున్నాడా..

 Pawan surender Reddy
2020-09-03 14:55:14

దర్శకుడు, రచయిత మధ్య సింక్ సరిగ్గా ఉంటే ఆ సినిమా కూడా అద్భుతంగా వస్తుంది. అలా తెలుగు ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. ఆ రైటర్ డైరెక్టర్ కలిస్తే ఖచ్చితంగా సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని నమ్మకం ప్రేక్షకుల్లో కలిగించారు. అలాంటి ఒక జోడి సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ. ఈ కాంబినేషన్ లో కిక్, రేసుగుర్రం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. కిక్ 2 ఫ్లాప్ కావడంతో సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ మధ్య కాస్త దూరం పెరిగింది. ఆ వెంటనే వంశీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో దర్శకుడు కూడా అయ్యాడు. కానీ అది ఫ్లాప్ కావడంతో రెండో అవకాశం కోసం కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తున్నాడు. ఇలాంటి సమయంలో మళ్లీ ఈయన సురేందర్ రెడ్డి దగ్గర పని చేయడానికి సిద్ధమైపోయినట్లు ప్రచారం జరుగుతుంది. 

సైరా సినిమా తర్వాత సురేందర్ రెడ్డి ఇప్పటి వరకు మరో సినిమా ఒప్పుకోలేదు.. అనౌన్స్ చేయలేదు కూడా. ఇలాంటి సమయంలో ఈయనకు పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం వచ్చింది. పవన్ స్నేహితుడు రామ్ తాళ్లూరి దీనికి నిర్మాత. ఈ సినిమా కోసం సురేందర్ రెడ్డి, వంశీ కలిసి పని చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు సరిపోయేలా వక్కంతం వంశీ ఒక అద్భుతమైన కథ సిద్ధం చేస్తున్నట్లు ఇండస్ట్రీలో బాగానే ప్రచారం జరుగుతుంది. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కథను వంశీ సిద్ధం చేస్తున్నాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఆ కథలో సందేశం కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ కోసం ఒక బ్లాక్ బస్టర్ కాంబినేషన్ మళ్లీ కలుస్తుంది. మరి వాళ్ళు చేసే సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

More Related Stories