English   

రియా ఇంటి మీద డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు 

Rhea Chakraborty
2020-09-04 09:37:59

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రియా చక్రవర్తి మీద ద్రుష్టి పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ టీం రియా చక్రవర్తి ఇంటిపై దాడి చేసింది. ఎన్‌డిపిఎస్ చట్టం నిబంధనల ప్రకారం ఇంట్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఎన్‌సిబి ఉన్నతాధికారులు, మహిళా సిబ్బందితో పాటు రియా అపార్ట్‌మెంట్‌ మీద, రియా సుశాంత్ వద్ద పెట్టిన మరో మేనేజర్ ఇంటి మీదా ఏక కాలంలో దాడి చేశారు. ఆమెకు డార్క్ నెట్  తో సంబంధం ఉందని భావించిన అధికారులు ఈ దాడులు చేసినట్టు తెలుస్తుంది. రియా మరియు ఆమె సోదరుడు షోయిక్ సంబంధిత మాదకద్రవ్యాల కేసులో ప్రధాన నిందితులని ఎన్‌సిబి చెబుతోంది. షోయిక్ చాట్ ప్రకారం, మార్చి 17, 2020 న, అతను జైద్ నంబర్‌ను శామ్యూల్ మిరాండాకి షేర్ చేశారు. 

ఇక సిబిఐ ఈ కేసులో రియా చక్రవర్తిని అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 306 ప్రకారం, ఆత్మహత్యకు పాల్పడటం, సిబిఐ వారి దర్యాప్తులో రియాను కలిసిన కొద్ది రోజుల తరువాత సుశాంత్ పరిస్థితి క్షీణించడం ప్రారంభించిందని అధికారులు గుర్తించారు. సుశాంత్‌ తో రియా పరిచయం తర్వాత సుశాంత్ కి గంజాయి అలవాటు చేసినట్టు గుర్తించారు. రియా తన సోదరుడు షోయిక్ ద్వారా ఎప్పుడూ తన ఇంట్లో డ్రగ్స్ ఉంచుకుంటారని, సుశాంత్ మాదకద్రవ్యాలకు బానిసయ్యాడని తెలుస్తుంది. ఇంతలో, సుశాంత్ సోదరీమణులు సుశాంత్ మాదకద్రవ్యాల గురించి తెలుసుకున్నప్పుడు, వారు సుశాంత్ ని రియాకు దూరంగా ఉండమని కోరారు, అయినప్పటికీ, సుశాంత్ రియా లేకుండా ఉండలేక ఆమెను దూరం పెట్టలేకపోయాడు.

More Related Stories