English   

సుశాంత్ సింగ్ సిబిఐ విచారణ పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు..

Vijayashanti
2020-09-04 09:43:32

బాలీవుడ్ యువహీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో ఉన్న నిజానిజాలు వెలికితీయడానికి సిబిఐ తన వంతు ప్రయత్నం చేస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ కేసుతో సంబంధం ఉన్న వాళ్లందరినీ విచారిస్తుంది. అయితే సుశాంత్ కేసులో రాజకీయాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే విజయశాంతి ఈ కేసుపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె తెలుగులో కొన్ని ట్వీట్లు పెట్టింది. అవేంటో చూద్దాం..

బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య వెనుక వాస్తవాల్ని వెలికితీసేందుకు ప్రభుత్వాలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. దోషుల్ని పట్టుకోవడానికి సీబీఐ విచారణకు సైతం ఆదేశించడం హర్షణీయమే గానీ, సినీరంగంలో ఒకప్పుడు ఇంతకంటే దారుణ పరిస్థితుల్లో చిక్కుకుని ఎందరో నటీమణులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. కానీ, వారిలో ఒక్కరి ఆత్మకైనా శాంతి కలిగేలా ఈ స్థాయిలో విచారణ, దర్యాప్తు జరిగాయా? ఎందరో నటీమణులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తే నామమాత్రంగా కేసులు నమోదు, తూతూ మంత్రంగా విచారణ చేసి చివరకి మమ అనిపించడం చూశాం. సుశాంత్ కేసులో బయటకొస్తున్న విషయాలు విస్మయం కలిగిస్తున్నాయి.

వెండితెరపై వెలగాలని ఎన్నో ఆశలతో వచ్చే కళాకారులు ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఎదురవడం బాధాకరం. అయితే దర్యాప్తు, విచారణ అనేవి వివక్ష లేకుండా ఎవరి విషయంలోనైనా ఒకేలా ఉండాలి. ఈ విషయంపైన ఒక జాతీయ టీవీ చానెల్‌లో జరిగిన చర్చ సందర్భంగా ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే స్పందించారు. సెలబ్రిటీలకైనా, సామాన్యులకైనా న్యాయప్రక్రియ ఒకేలా ఉన్నప్పుడే న్యాయాన్ని ఆశించగలమని సాల్వే అన్నారు.  ఇలాంటి ఎన్నో సంచలనాత్మక కేసుల విచారణ క్రమాన్ని గమనిస్తే, తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో ఏసీబీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు ఎంతో శ్రమించి కోర్టులకు ఆధారాల్ని సమర్పిస్తాయి కానీ...ఆ కేసుల్లో వారు ఆశించిన ఫలితం రాకుంటే ప్రభుత్వాలు అప్పీలుకు వెళ్ళకపోవడం వల్ల శిక్షలు పడే అవకాశం బలంగా ఉన్న కేసులు సైతం నీరుగారుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు జరగాలి.. అంటూ ఇలా చేసిన ట్వీట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

More Related Stories