ఉమామహేశ్వరరావు మీ ఇంటికే

సత్యదేవ్ హీరోగా కంచరపాలేం ఫేమ్ వెంకటేశ్ మహా దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'. కరోనా కారణంగా ఈ సినిమా థియేటర్స్ విడుదలకాకుండా డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమా శాటిలైట్ రైట్స్‌ను ఈ టీవీ కొనుగోలు చేసింది. మామూలుగా కొత్త సినిమా శాటిలైట్ రైట్స్ విషయంలో జెమినీ, మా టీవీ, జీ తెలుగు వంటి ఛానల్స్ పోటి పడి కొంటాయి. కానీ ఈ సారి ఈ సినిమాను ఈటీవీ భారీ ధర చెల్లించి ఉమామహేశ్వర ఉగ్రరూపస్య శాటిలైట్స్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా త్వరలో ఈటీవీలో ప్రసారం కానుంది. ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈటీవీలో సెప్టెంబర్ 13 వ తారీఖు ఆదివారం సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ కానుందని తెలిపింది ఈ టీవీ. ఈ సినిమా తనకు కూడా నచ్చింది అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా లేటెస్ట్ గా చెప్పడం మరో విశేషం. అయితే ఇప్పుడు ఉమా మహేశ్వరరావు నేరుగా మీ ఇంటికే వచ్చి పలకరించనున్నాడన్న మాట.