English   

క్రిష్ షూటింగ్ లో కరోనా కలకలం

 Krish and Vaishnav Tej
2020-09-04 11:57:28

క్రిష్ కొత్త సినిమా టీమ్ కి కరోనా షాకిచ్చిందట. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌ తో సినిమా చేయడం లేట్ అవుతుందని భావించి క్రిష్‌ సాయిధ‌ర‌మ్‌తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఓ చిత్రాన్ని ఇటీవ‌ల ప్రారంభించిన విష‌యం తెలిసిందే. తెలుగులో పాపులర్ అయిన పాపుల‌ర్ న‌వ‌ల `కొండ పొలం` ఆధారంగా వాస్త‌విక కోణంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమా ఇప్పుడు షూట్ జరుపుకుంటోంది. మొన్ననే ర‌కుల్ కూడా చిత్ర‌బృందం తో క‌లిసి షూటింగ్‌ లో పాల్గొంది. అయితే ఈ మూవీ షూటింగ్ వున్న‌ట్టుండి ఆగిపోయిందని టాక్ మొదలయింది. అదేంటి నిన్న మొన్న మొదలు పెట్టి ఇప్పుడే  ఆపేయ‌డ‌మేంట‌ని ఆరా తీస్తే ఈ టీమ్‌లో కీల‌క వ్య‌క్తికి క‌రోనా సోకిన‌ట్టు తెలిసిందని అంటున్నారు. అందుకే ద‌ర్శ‌కుడు క్రిష్ మూవీ షూటింగ్‌ని ఆపేశార‌ట‌. ఈ విష‌యం తెలిసి వైష్ణ‌వ్ తేజ్‌, ర‌కుల్ షాక్‌కు గురైన‌ట్టు తెలిసింది. ఇక స‌ద‌రు వ్య‌క్తితో యూనిట్ అందరూ కాంటాక్ట్ అయి ఉండడంతో వారంతా క్వారెంటైన్‌కి వెళ్లారని తెలుస్తోంది. దీంతో క్రిష్ సహా టీమ్ అంతా హోమ్ క్వారెంటైన్‌కి ప‌రిమిత‌మైన‌ట్టు తెలుస్తోంది.

More Related Stories