English   

శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్ట్

Nutan Naidu
2020-09-05 12:58:14

శిరోముండనం కేసులో నూతన్ నాయుడును పోలీసులు అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. అరెస్ట్ చేస్తారన్న భయంతో ముంబైకి పారిపోయే ప్రయత్నం చేస్తున్న నూతన్ నాయుడిని కర్ణాటకలోని ఉడిపి రైల్వే స్టేషన్ లో పట్టుకున్నామని విశాఖ పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా  ప్రకటించారు. ఇప్పటికే ఈ కేసులో ప్రియమాధురి సహ ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపామన్న ఆయన ఘటన జరిగిన రోజు 6 సెల్‌ఫోన్స్‌ సీజ్ చేశామని అన్నారు. శిరోముండనం కేసులో నూతన్ నాయుడు పాత్ర ఉందన్న ఆయన నూతన్ భార్య సమక్షంలోనే దళిత యువకుడికి శిరోముండనం జరిగిందని సీపీ వెల్లడించారు. సీసీ ఫుటేజీతో పాటు కీలక ఆధారాలు సేకరించామని వెల్లడించారు. ఇక ఈ కేసులో A 1 గా నూతన్ నాయుడు భార్య మధుప్రియ ఉన్న సంగతి తెలిసిందే. శిరో ముండనం చేసే ముందు చేసిన తర్వాత కూడా నూతన్ నాయుడుతో భార్య మధుప్రియ మాట్లాడినట్టు గుర్తించామని కమిషనర్ అన్నారు. నూతన్ నాయుడు భార్య సమక్షంలోనే దళిత యువకుడి శ్రీకాంత్ కు శిరోముండనం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఉడిపిలో శుక్రవారం మధ్యాహ్నం నూతన్‌ను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్న ఆయన నూతన్ నాయుడు ఫోటోలు కూడా మీడియాకి విడుదల చేసారు. 

More Related Stories