English   

ఆది పురుష్ లో హీరోయిన్ ఆమెనే.. మహేష్ ని కాదని మరీ 

Kiara Advani
2020-09-05 13:35:47

ఈ ఏడాది మొదట్లోనే సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు మహేష్ బాబు. అయితే మళ్ళీ తన తదుపరి సినిమాని తనకు మహర్షి వంటి సూపర్ హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లితో చేస్తున్నాడని ముందే క్లారిటీ ఇచ్చినా అది ఎందుకో కానీ కార్యరూపం దాల్చలేదు. అయితే తరువాత అనూహ్యంగా మహేష్ పరశురామ్ కాంబినేషన్ సినిమా ఒకటి తెర మీదకు వచ్చింది. సర్కారు వారి పాట పేరుతొ తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ముందు నటించమని కియారాను అడిగితే ఆమె నో చెప్పిందట. ఆమె ఈ ప్రాజెక్ట్ ని సున్నితంగా తిరస్కరించారని చెబుతున్నారు. ఎందుకంటే కియారా అద్వానీ ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండడం వలన ఈ మూవీ చేయలేను అని చెప్పేసిందట. 

అయితే ఇప్పుడీ భామ మహేష్ ను కాదని ఏకంగా ప్రభాస్‌ మూవీకి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిందనే ప్రచారం మొదలయింది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రాల్లో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో తీస్తున్న ”ఆదిపురుష్” కూడా ఒకటి. ఈ సినిమాకి మొదట సీత పాత్రలో కీర్తీ సురేష్ పేరు వినిపించినా ఆ తర్వాత మళ్ళీ కియారా అద్వాని పేరు గట్టిగా వినిపించింది. అయితే ఈ ఇద్దరిలో ఓం రౌత్ కియారానే హీరోయిన్ గా ఫిక్స్ చెయ్యాలని అనుకుంటున్నట్టు చెబుతున్నారు. అలాగే ఈమెకు ఇప్పటికే కథను కూడా వినిపించగా ఆమె ఇంప్రెస్ అయ్యి వెంటనే ఓకే చెప్పెసిందని అంటున్నారు. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

More Related Stories