English   

అల వైకుంఠపురములో ఖాతాలో మరో యూట్యూబ్ రికార్డ్ 

Ala Vaikuntapuramlo
2020-09-05 13:43:24

అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'అల వైకుంఠపురములో'.. పూజా హేగ్దే కథానాయకగా నటించిన ఈ సినిమా మొన్న సంక్రాంతికి రిలీజయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. చాలా చోట్ల నాన్ బాహుబలు రికార్డులు అన్నీ ఈ సినిమా తన పేరున రాసేసుకుంది. గీతా ఆర్ట్స్, హరిక హాసిని క్రియేషన్స్ కలిసి ఈ సినిమాని నిర్మించి జాయింట్ గా జాక్ పాట్ కొట్టారు. కొన్ని ఏరియాల్లో బాహుబలి మొదటి పార్ట్ వసూళ్లను కూడా బీట్ చేసిందని కూడా అన్నారు. అయితే కలెక్షన్స్ విషయాలు పక్కన పెట్టినా ఈ సినిమా ఈ మ్యూజిక్ విషయంలో కూడా యూట్యూబ్ లో రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తూ ఉంది. సినిమాలోని పాటలు గత ఏడు ఎనిమిది నెలలుగా జనాలు వింటూనే ఉన్నారు. దీంతో యూట్యూబ్ లో భారీ వ్యూస్ ను దక్కించుకుని సౌత్ ఇండియాలోనే టాప్ ఆల్బంగా నిలిచిందని రికార్డులు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు చెందిన పాటలు యూట్యూబ్ లో ఏకంగా అయిదు వంద మిలియన్ లను క్రాస్ అయ్యాయి. ఈ సినిమాకి సంబంధించిన సామజవరగమన వీడియో సాంగ్ 100 మిలియన్ లను అందుకుంది. అది మాత్రమే కాకుండా తాజాగా రాములో రాముల లిరికల్ అలానే వీడియో సాంగ్ ఇప్పుడు ఏకంగా రెండు వందల మిలియన్ మార్క్ కి చేరుకుంది. మరి ఈ సినిమా ఈ యూట్యూబ్ పరంగా ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో వేచి చూడాలి.

More Related Stories