గట్టి ప్లాన్ వేసిన మహేష్ బాబు

ఈ యేడాది మొదట్లోనే సంక్రాంతికి మహేష్ బాబు-అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా కూడా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత సినిమాగా మహేష్ పరుశురామ్ తో చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ముందు వంశీ పైడిపల్లి తో సినిమా ఉంటుందని అనుకున్నా కారణాలు ఏవయినా కానీ ఆ ప్రాజెక్ట్ అయితే ప్రస్తుతానికి పక్కన పెట్టారు. పరశురామ్ తో సర్కారు వారి పాట సినిమా అనౌన్స్ చేశారు. రాజమౌళి మహేశ్ ను డైరెక్ట్ చేస్తున్నట్టు... లైవ్ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
అయితే ఈ సినిమా మొదలుకావడానికి రెండేళ్లు పడుతుంది.అయితే రాజమౌళి సినిమా మహేష్ కి మొదటి ప్యాన్ ఇండియా సినిమా అవుతుందని అనుకున్నారు. కానీ ఈ కరోనా దెబ్బకు మహేష్ ఇప్పుడు చేసే సినిమాతోనే ప్యాన్ ఇండియా చేసేద్దామని ఫిక్స్ అయ్యాడట. దాని ప్రకారం ఈ సినిమాలో విలన్ ని బాలీవుడ్ నుండి తెస్తున్నారట. తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఆ వార్త చిత్రపరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ విలన్ గా నటిస్తున్నాడని అంటున్నారు. ఇటీవల అనిల్‌ని కలిసిన పరశురామ్ 'సర్కారు వారి పాట' కథను వినిపించారని, అందులో విలన్ పాత్ర ఆయనకు నచ్చడంతో వెంటనే ఒకే చేసేశాడని అంటున్నారు. ఈ సినిమాని జీఎమ్‌బి ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.