English   

అడుక్కుతినటానికి కూడా పనికొచ్చేవాడిని కాదు.. గురువు గురించి వర్మ శిష్యుడు 

Ajay Bhupathi
2020-09-07 09:43:11

‘ఆర్‌ఎక్స్‌ 100’ అనే చిన్న సినిమా భారీ హిట్ కొట్టిన తర్వాత చిత్ర పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ దర్శకుడు అజయ్‌ భూపతి పేరు విపరీతంగా వినిపించింది. ఆయన నితిన్ తో సినిమా చేస్తారంటూ జోరుగా వార్తలు వినిపించాయి. అవి  నిజం కాగ పోగా ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేస్తారని అన్నారు. మహాసముద్రం టైటిల్‌తో అజయ్‌ భూపతి ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని, ఇదొక మల్టీస్టారర్‌ సినిమా అని ఇందులో ఓ కథానాయకుడిగా నటించేందుకు బెల్లకొండ సాయి శ్రీనివాస్‌ అంగీకరించాడని వార్తలు వచ్చాయి. అయితే ఆ పేరు వినిపిస్తోంది కానీ ఆయన పేరు వినపడడం లేదు. అయితే ఆ మధ్య కరోనా వచ్చిందని చెప్పి వార్తలోకి వచ్చిన ఆయన ఇప్పుడు తన గురువు గారి గురించి కామెంట్ చేసి వార్తల్లోకి ఎక్కాడు.  వర్మ శిష్యుడు అయిన అజయ్ భూపతి ఆయనకు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ పెట్టాడు. అదే పోస్ట్ లో మరో గురువు అయిన క్యాంప్ శశి గురించి అనుచిత కామెంట్స్ చేశాడు. " నేను నా గురువులాగా భావించింది ఇద్దరినే.. ఒకరు రామ్ గోపాల్ వర్మ అయితే, రెండో వ్యక్తి క్యాంప్ శశి... నువ్వు నాకు నేర్పిన పాఠాలు ఉన్నాయే, నీ మాటలు వినుంటే అడుక్కుతినటానికి కూడా పనికొచ్చేవాడిని కాదు!!" అని అజయ్ భూపతి ట్విట్టర్ లో రాసుకొచ్చారు. అయితే అజయ్ భూపతి సదరు వ్యక్తిని సరదాగా కామెంట్ చేసినట్టు చెబుతున్నారు. 

More Related Stories