English   

అలనాటి లవకుశ లో కుశుడి పాత్రధారి కన్నుమూత..

Lava Kusa Nagaraju
2020-09-07 13:41:48

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు హీరోగా నటించిన లవకుశ సినిమాలో తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఈ సినిమాలో రాముడిగా ఎన్టీఆర్.. సీతా దేవిగా అంజలీ దేవి నటించారు. ఇక కథకు అతి ప్రధానమైన లవకుశ పాత్రలను ఆనాటి బాల నటులు  సుబ్రహ్మణ్యం, నాగరాజులు నటించారు. వీరిలో కుశుడుగా నటించిన అనపర్తి నాగరాజు సెప్టెంబర్ 7న  కన్నుమూశారు. ఈయన వయసు 71 సంవత్సరాలు. గుండెపోటుతో హైదరాబాద్‌ లోని గాంధీ నగర్ లో తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు నాగరాజు. ఆయనకు భార్య ముగ్గురు కుమార్తెలు. లవకుశ చిత్రంతో బాల నటుడిగా వెండితెరకు పరిచమయ్యారు. 1963లో లవకుశ విడుదలైంది. ఆ సినిమా సమయానికి నాగరాజు వయసు 13 సంవత్సరాలు. లవకుశ తర్వాత తెలుగు తమిళం భాషల్లో  340కు పైగా చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్  పౌరాణిక చిత్రాల్లో షుమారు 22 చిత్రాల్లో వివిధ పౌరాణిక పాత్రల్లో నటించారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.  

More Related Stories