English   

బన్నీ పుష్ప మూవీలో నారా రోహిత్

 Nara Rohit
2020-09-07 13:57:05

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేష‌న్‌ లో పుష్ప అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బ‌న్నీ లారీ డ్రైవర్ అని ముందు నుండి ప్రచారం జరిగింది. అయితే గంధపు చెక్కల స్మగ్లర్‌ గా కనిపించనున్నాడని పుష్ప సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో క్లారిటీ వచ్చింది. అయితే ఈ సినిమాని బన్నీ కెరీర్ లో మొదటిసారిగా తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల‌లో అంటే ప్యాన్ ఇండియా మూవీగా విడుదల చేయ‌నున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న నేప‌థ్యంలో సౌత్‌, నార్త్ ఇండ‌స్ట్రీకి సంబంధించి ప‌లువురు ప్రముఖుల‌ని ఎంపిక చేశారు. ఈ సినిమా నుండి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని తప్పుకున్నారని ఆయన ప్లేస్ లో బాబీ సింహాని తీసుకున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. 

రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని గ్యాప్ లేకుండా షూట్ చేయాలని దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఇంకా ఎప్పటి నుండి ఈ సినిమా షూట్ మొదలు కానుందో తెలియదు కానీ ఈ సినిమాలో మరో హీరో నటిస్తున్నాడని అంటున్నారు. ఆ హీరో మరెవరో కాదు నారా రోహిత్. చివరిగా వీరభోగ వసంతరాయలు సినిమాలో నటించిన ఈయన బాణం దర్శకుడితో మరో సినిమా చేస్తున్నాడని అంటున్నారు. ఆ విషయం మీద క్లారిటీ అయితే రావలసి ఉంది. ఇక ఈ సినిమా కథ ప్రకారం ఎక్కువగా అడవుల్లో సీన్స్ ఉంటాయి. కనుక అడవిలోనే ఎక్కువ రోజులు షూటింగ్ చేయాల్సి ఉంటుంది. ముందు బ్యాంకాక్ అనుకున్నారు కుదరలేదు, ఆ తరువాత కేరళ అనుకున్నా అదీ కుదరలేదు, చివరికి ఎపీలోని మారేడుమిల్లిలో చేయాలనుకున్న అక్కడా భయంగానే ఉంది. చూడాలి మరి షూట్ ఎక్కడ చేస్తారో. 
 

More Related Stories