English   

త్రివిక్రమ్ అభిమానులని నిరాశపరిచిన నిర్మాత 

venkatesh
2020-09-07 14:28:18

విక్టరీ వెంకటేష్‌ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఎఫ్‌2 సినిమాతో ట్రాక్ లోకి వచ్చిన వెంకీ ఆ తర్వాత నటించిన `వెంకీమామతో మరో హిట్ కొట్టాడు. ప్రస్తుతం వెంకటేష్‌ `నారప్ప` చిత్రంలో నటిస్తున్నారు. ఇది తమిళంలో ధనుష్‌ హీరోగా రూపొంది బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన `అసురన్‌`కి రీమేక్‌. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న `నారప్ప` వెంకటేష్‌కి 74వ సినిమా. ఇక తన కెరీర్‌లో మైలురాయిలాంటి 75వ సినిమా కోసం సన్నాహాలు ప్రారంభించారని అంటున్నారు. అయితే ఈ సినిమాని త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేసేందుకు సిద్ధమవుతున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. నిజానికి వెంకీ హీరోగా రెండేళ్ళ క్రితమే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా రావాల్సి ఉంది. హారికా అండ్‌ హాసినీ క్రియేషన్‌ ఈ సినిమాని అధికారికంగానూ ప్రకటించింది. కానీ అనుకోకుండా ఆ సినిమా పట్టాలెక్కలేదు. 

ఓ వైపు వెంకీ ఇతర ప్రాజెక్ట్ లతో బిజీగా కావడం, మరోవైపు త్రివిక్రమ్‌ సైతం వేరే హీరోలతో సినిమాలు చేయడంతో ఆ ప్రాజెక్ట్ పక్కకు వెళ్ళింది. అయితే ఇప్పుడు అదే సినిమాని వెంకీ 75వ సినిమాగా రానుందని అంటున్నారు. అయితే ఈ విషయం మీద హారికా అండ్‌ హాసినీ క్రియేషన్‌ నిర్మాత వంశీ క్లారిటీ ఇచ్చాడు. ఈరోజు నువ్వు నాకు నచ్చావ్ సినిమ వచ్చి 19 ఏళ్ళు అయిన సంధర్భంగా ఈ కాంబినేషన్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ విషయం మీద ఆయన స్పందిస్తూ ఆ కాంబినేషన్ మీద మీ ఆత్రుత అర్ధం చేసుకోగలం అని, కానీ వెంకీ 75 గురించి జరుగతున్న ప్రచారం అయితే నిజం కాదని అన్నారు. అలాంటిది ఏమయినా ఉంటే తానే ప్రకటిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. 

More Related Stories