English   

అబ్బే కీర్తి సినిమాని ఓటీటీకి అమ్మలేదట 

Keerthi Suresh
2020-09-07 15:07:25

కరోనా ప్రభావంతో దాదాపు అన్ని రంగాలు నష్టపోయాయి. అలా నష్టపోయిన రంగాల్లో సినీ పరిశ్రమ కూడా ముందు వరుసలో ఉంది. మరో వైపు సినిమా థియేట‌ర్స్ ఓపెన్ చేసే విష‌యంలో క్లారిటీ రాక‌పోవ‌డంతో చిన్న నిర్మాతల ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా త‌యారయిందని చెప్పచ్చు. అప్పులు తెచ్చిన చిన్న సినిమాల నిర్మాత‌లు సినిమాల‌ను డిజిట‌ల్ మీడియాల్లో విడుద‌ల చేసుకోవ‌డానికి ఆస‌క్తిని చూపుతున్నారు. ఇప్ప‌టికే హీరో సూర్య స‌హా మ‌రి కొంతమంది తాము నిర్మించిన సినిమాల‌ను ఓటీటీల్లో విడుద‌ల చేసేశారు. ఈ కోవలోనే కీర్తిసురేశ్ సినిమా పెంగ్విన్ ఓటీటీలో విడుదలవుతుంది. అలాగే ఆమె నటించిన మరో సినిమా మిస్ ఇండియా కూడా ఓటీటీలోనే విడుదలయ్యే అవకాశాలే ఉక్కువగా ఉన్నాయని అంటున్నారు. 

ఇప్పుడు ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ మంచి ధరకు దక్కించుకున్నట్టు టాక్ వినిపిస్తుంది. వారు ఏకంగా ఈ సినిమాని 11 కోట్లకు కొనుక్కున్నట్టు ప్రచారం గట్టిగానే జరిగింది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదట. ఈ సినిమాని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎన్టీఆర్ కి ఒకప్పటి పీఆర్వో అయిన మహేష్ కోనేరు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో జగపతి బాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, పూజిత పొన్నాడ ఇతర కీలక పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమా  మీద కూడా ఆసక్తి నెలకొంది. మరి ఓటీటీలో రిలీజ్ కాకుంటే సినిమా థియేటర్ లో ఎప్పటికి రిలీజ్ అయ్యేనో ఏమో ?

More Related Stories