English   

సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూత

Jayaprakash Reddy.jpg
2020-09-08 08:29:54

మరో విషాదం : సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూత
టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు, నాటక రంగం నుండి సినిమాల్లోకి ఎంటర్ అయిన జయ ప్రకాష్ రెడ్డి కన్నుమూశారు. ఈ ఉదయం సుమారు ఉదయం 7 గంటల ప్రాంతంలో ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడిచారని తెలుస్తోంది. ఆయన ఈ ఉదయం బాత్రూంకి వెళ్ళగా అక్కడే గుండె పోటు రావడంతో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు తేరుకుని ఆయన్ని ఆస్పత్రికి తరలించేలోగానే ఆయన మరణించారు. తెలుగు సినిమాల్లో రాయలసీమ యాసలో మాట్లాడుతూ ఆయన తనదైన విలనిజం, కామెడీ పండించే వారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన ఆయన కొద్ది సంవత్సరాల క్రితం గుంటూరులో సెటిల్ అయ్యారు. అయితే  కరోనా లాక్ డౌన్ విధించినప్పటి నుంచి గుంటూరులోని స్వగృహంలోనే ఉంటున్నారు.  దీనికి సంబందించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

More Related Stories