English   

నిర్మాత దిల్ రాజును నమ్మి అడ్డంగా మునిగిన అమెజాన్..

Nani
2020-09-08 08:50:26

తెలుగు ఇండస్ట్రీలో కొందరు నిర్మాతలున్నారు. వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ నుంచి సినిమా వచ్చింది అంటే కచ్చితంగా అందులో విషయం ఉంటుంది అని అందరూ అనుకుంటారు. అలాంటి నిర్మాతలు దిల్ రాజు కూడా ఉంటాడు. ఈయన ఒక స్క్రిప్ట్ తీసుకున్నాడు అంటే కచ్చితంగా అందులో విషయం ఉంటుంది అని నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి తోడు ఆ స్క్రిప్టు విషయంలో దిల్ రాజు ప్రయాణం కూడా ఉంటుంది. ఈ క్రమంలోనే ఈయన నిర్మించిన వి సినిమాపై కూడా ముందు నుంచి భారీ అంచనాలున్నాయి. దానికి తోడు అది నాని 25వ సినిమా కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. నిజానికి ఉగాదికి ఈ సినిమా థియేటర్లలో విడుదల కావాల్సింది. 

కానీ మధ్యలో కరోనా వైరస్ వచ్చి ఐదు నెలలపాటు వాయిదా పడి చివరికి అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. క్రేజీ సినిమా కావడం.. పైగా నాని హీరో కావడం.. అన్నింటికీ మించి దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న సినిమా కావడంతో అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా దాదాపు 33 కోట్లు ఈ సినిమా కోసం చెల్లించింది. భారీ సినిమా కావడంతో ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చింది ఖచ్చితంగా తమ డబ్బులు వెనక్కి వస్తాయని వాళ్ళు బలంగా నమ్మారు. అన్నింటి కంటే ముందు దిల్ రాజుపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు అమెజాన్. కానీ ఇప్పుడు సినిమా విడుదలైన తర్వాత వస్తున్న టాక్ చూస్తుంటే వాళ్లు నిర్మాతని ఎంత గుడ్డిగా నమ్మారనేది అర్థమైపోతుంది. ప్రస్తుతం వి సినిమాకు వచ్చిన టాక్ చూసిన తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోకు లాభాలు పక్కనపెడితే పెట్టుబడి అయినా వస్తుందా అనేది అనుమానంగా మారింది. 

More Related Stories