జయప్రకాష్ రెడ్డి మృతిపై నరేంద్ర మోడీ ట్వీట్..

లెజెండరీ నటుడు జయప్రకాష్ రెడ్డి ఆకస్మిక మృతితో తెలుగు సినిమా ఇండస్ట్రీ విషాదంలోకి వెళ్ళిపోయింది. ఆయన మరణ వార్త ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆయన చితిపై ఇప్పటికే సంతాపం వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ.. జయప్రకాష్ రెడ్డి మృతిపై స్పందించారు. ఆయన మరణంపై ఆయన తెలుగులో ట్వీట్ చేయడం విశేషం. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జయ ప్రకాష్ రెడ్డి గారు తనదైన ప్రత్యేక నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారు . తన దీర్ఘ కాల సినీ యాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. వారి మరణం సినిమా ప్రపంచానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి.. అంటూ మోడీ ట్వీట్ చేశారు. ఒక తెలుగు నటుడికి మోడీ ట్వీట్ చేయడం నిజంగా గర్వకారణం. దీన్నిబట్టి జయప్రకాష్‌రెడ్డి భారతీయ సినిమా పరిశ్రమను ఏ స్థాయిలో ప్రభావితం చేశారో అర్థం చేసుకోవచ్చు.