English   

 శర్వా హీరోగా, ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో మహాసముద్రం

Sharwanand
2020-09-09 11:44:37

‘ఆర్‌ఎక్స్‌ 100’ వంటి హిట్‌తో తెలుగు చిత్రసీమ దృష్టిని ఆకర్షించాడు వర్మ శిష్యుడు అజయ్‌ భూపతి. అంత హిట్ కొట్టినా రెండో సినిమాని పట్టాలెక్కించడానికి మాత్రం ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటున్నాడు. ఆయన ‘మహా సముద్రం’ పేరుతో ఓ క్రేజీ మల్టీస్టారర్‌ను పట్టాలెక్కించాలని చూస్తున్నట్టు చాలా రోజులుగా ప్రచారం జరిగింది. ఈ కథ అనేక మంది హీరోల చుట్టూ తిరగ్గా చివరికి రవితేజ దగ్గరికి వెళ్ళిందని, ఆయన ముందు ఒప్పుకున్నా కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని ఒక ప్రచారం. దీంతో ఇదే కథను విశ్వక్‌ సేన్‌ - కార్తికేయలతో కలిసి చేస్తున్నాడని కూడా వార్తలు వచ్చాయి. అలా రవితేజ మొదలు నాగచైతన్య దాకా అనేక మంది హీరోల చేతులు మారిన కధ శర్వానంద్‌ వద్దకు చేరి ఓకె అయింది. ఈ సినిమాకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ప్రచారం జరిగింది. ఎట్టకేలకి ఆ ప్రచారం నిజం అయింది. 

మహా సముద్రం ప్రాజెక్ట్ ని ఈ రోజు అధికారికంగా ప్రకటించబడింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ బ్లాక్ బస్టర్ సరిలేరు నీకెవ్వరుతో హిట్ కొట్టాక ఎకె ఎంటర్టైన్మెంట్స్ మహా సముద్రం సినిమాని నిర్మిస్తోంది. ఈ సినిమాని సుంకర రామబ్రహ్మం తెలుగు-తమిళ బిలింగుల్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి ప్రతి వారం కొన్ని సెన్సేషనల్ సర్ప్రైజ్ ప్రకటనలు ఉంటాయని టీమ్ ప్రకటించింది. ఈ సినిమాలో మజిలీ ఫేం దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటించే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాని కరోనా సద్దుమణిగాక ప్రారంభించవచ్చని అంటున్నారు. అయితే ముందు నుండీ ప్రచారం జరిగినట్టు ప్రచారం జరిగినా ఆ విషయాన్ని మాత్రం ప్రకటనలో ఎక్కడా మెన్షన్ చేయలేదు. 

More Related Stories