English   

మహేష్ బాబు నిర్మాతగా వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్   

 Vamshi Paidipally
2020-09-09 12:00:29

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను మన తెలుగు స్టార్స్ మాత్రం సీరియస్ గా తీసుకుంటున్నారు. నాలుగు రాళ్ళు సంపాదిస్తున్నప్పుడే వీరు తమ డబ్బును వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టి దానిని రెండింతలు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ పద్దతిని అందరూ ఫాలో అవుతూ ఉంటారు. ఇందులో ఎవరూ మినహాయింపు కాదు. స్టార్ నటుల నుండి చిన్నా చితకా వారి దాకా అందరూ ఈ సూత్రాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పటికే మ‌హేష్ బాబు ఒక వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు బిజినెస్ రంగంలో త‌న స‌త్తా చూపించేలా కృషి చేస్తున్నాడు. ఆ మ‌ధ్య మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన మహేష్ సినిమా నిర్మాణం కూడా చేస్తున్నాడు. అయితే ఆయన ఆ మధ్య సొంతగా ఓటీటీ ఒకటి లాంచ్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. 

ఆ సంగతి పక్కన పెడితే ఈయన ఇప్పుడు వెబ్ సిరీస్ నిర్మించాలని చూస్తున్నట్టు చెబుతున్నారు. గతంలోనే ఈ తరహా వార్తలు వచ్చాయి కూడా. మళ్ళీ ఎందుకో కానీ ఈ ప్రచారం మొదలయింది. తన స్నేహితుడు వంశీ పైడిపల్లి కోసం ఈ వెబ్ సిరీస్ నిర్మిస్తోన్నట్టు చెబుతున్నారు. నిజానికి సరిలేరు నీకెవ్వరు తరువాత ఆయన వంశీతో సినిమా చేయాల్సి ఉంది. అది కుదరలేదు, రామ్ చరణ్ తో ప్లాన్ చేస్తున్నాడని అన్నా ఇప్పటికిప్పుడు సినిమా చేసే పరిస్థితి లేదు. దీంతో వంశీ ఈ లోపు ఓ వెబ్ సిరీస్‌ చేయడానికి రెడీ అవుతున్నట్టు చెబుతున్నారు. చూడాలి మరి ఇందులో నిజం ఎంత ఉందనేది ? 
 

More Related Stories