English   

కంగనా రనౌత్ ఆఫీసుపై దాడులు.. ముంబైలో మహా డ్రామా..

Kangana Ranaut
2020-09-09 20:13:50

బాలీవుడ్లో ఫైర్ బ్రాండ్ అంటే మరో ఆలోచన లేకుండా వచ్చే పేరు కంగనా రనౌత్. ఎప్పటికప్పుడు అందరి తాట తీస్తుంది ఈ ముద్దుగుమ్మ. తన జోలికి వస్తే ఇంక అంతే సంగతులు. ముంబైలో ఉంటూ మహారాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకు పడుతుంది కంగనా రనౌత్. శివసేన పార్టీని టార్గెట్ చేసుకొని సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఇప్పుడు ఈమె ఆఫీసుపై ఉన్నట్టుండి బ్రిహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు దాడి చేశారు. సాధారణంగా నిర్వహించే సర్వేలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆఫీసుకు సంబంధించిన పూర్తి అనుమతులు ఉంటే తమకు చూపించాలని.. లేదంటే మాత్రం కూల్చివేత చర్యలు తప్పవని అధికారులు వెల్లడించారు. మరోవైపు కంగనా రనౌత్ మాత్రం ఇదంతా తనపై కావాలని చేస్తున్న కుట్ర అంటుంది. సుశాంత్ సింగ్ రాజ్ పుట్ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె చేసిన వ్యాఖ్యలు కొన్ని సంచలనం సృష్టించాయి. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి కొడుకుపై కంగనా చేసిన కామెంట్స్ వేడి పుట్టించాయి. అందుకే ఇప్పుడు ఇలా దాడులు జరిగాయని నెటిజన్లు కూడా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే తన కార్యాలయం గురించి బీఎంసీకి సమాచారం ఎప్పుడో ఇచ్చానని.. అయినా తన కార్యాలయంపై దాడులు జరిపారని కంగనా తెలిపింది. మరోవైపు ముంబైని అవమానించిన వ్యక్తికి కేంద్రం భద్రత కల్పించడం విచారకరమని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ అన్నారు. కంగనాని బీజేపీ అభ్యర్థిగా శివసేన భావిస్తోంది. మరి ఈ వివాదం ఎక్కడ ముగుస్తుందో చూడాలి. 

More Related Stories