English   

అందర్నీ కలుపుకుంటూ పోతున్న అల్లు అర్జున్..

  Allu Arjun
2020-09-09 13:21:48

అల్లు అర్జున్ ప్రస్తుతం గెలిచిన ఆనందంలో ఉన్నాడు. ఈ సంక్రాంతికి విడుదలైన అల వైకుంఠపురంలో సినిమా 150 కోట్లకి పైగా షేర్ వసూలు చేయడంతో ఈయన ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో ఉన్న అందరు హీరోలను కలుపుకుంటూ వెళ్తున్నాడు అల్లు అర్జున్. మరీ ముఖ్యంగా చిన్న హీరోలతో కలిసి నటిస్తున్నాడు. అల వైకుంఠపురంలో సినిమాలో అక్కినేని మేనల్లుడు సుశాంత్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇక ఈ పుష్ప సినిమాలో నందమూరి వారి హీరోతో కలిసి నటించబోతున్నాడు. ఈ సినిమాలో నారా రోహిత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈయన కోసం సుకుమార్ ఒక ప్రత్యేకమైన పాత్రను డిజైన్ చేశాడు. దీని కోసం కొందరు హీరోలను అనుకున్నా చివరికి నారా రోహిత్ దగ్గరికి వచ్చి ఆగింది. 

రెండేళ్లుగా ఎలాంటి సినిమాలు చేయని రోహిత్ పుష్ప సినిమాతో అదిరిపోయే రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో కథకు ముఖ్యమైన పాత్రలో నారా రోహిత్ నటించబోతున్నాడు. సినిమాను మలుపుతిప్పే పాత్ర ఇది అంటూ దర్శక నిర్మాతలు కూడా అభిప్రాయపడుతున్నారు. అల్లు అర్జున్ కు తమ్ముడులా ఉండే పాత్ర ఇది. రంగస్థలం తరహాలో మరోసారి రివేంజ్ డ్రామాని తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. మరికొన్ని రోజుల్లో మహబూబ్ నగర్ అడవుల్లో పుష్ప సినిమా షూటింగ్ మొదలు కానుంది. మొత్తానికి గత సినిమాలో అక్కినేని.. ఈ సినిమాలో నందమూరి వారసులను కవర్ చేశాడు అల్లు అర్జున్. 

More Related Stories