English   

చిన్నారి పెళ్లికూతురు బామ్మ పరిస్థితి విషమం..

Surekha Sikri
2020-09-09 14:08:22

తెలుగు ప్రేక్షకులకు చిన్నారి పెళ్లికూతురు సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందీ సీరియల్ డబ్బింగ్ వర్షన్ అయినా కూడా దాన్ని మన ప్రేక్షకులకు చాలా బాగా ఆదరించారు. అప్పట్లో చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ అత్యధిక రేటింగ్స్ తీసుకొచ్చింది. ఇక ఇందులో ఉన్న వాళ్ళందరూ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం. మరీ ముఖ్యంగా కుటుంబ పెద్దగా ఉన్న బామ్మ మన ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయిపోయింది. ఈమె పేరు సురేఖ సిక్రీ. బాలీవుడ్ లో ఈమెకు మంచి డిమాండ్ ఉంది. పైగా మూడు జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది సురేఖ. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో ఇంటింటికి పరిచయమైంది. ఈమె ఆరోగ్యం ఇప్పుడు ఉన్నట్టుండి దెబ్బతింది. ఇంటి దగ్గర జ్యూస్ తాగుతూ బ్రెయిన్ స్ట్రోక్ కు గురై కింద పడిపోయింది సురేఖ. ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ముంబైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం ఈమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గత రెండేళ్లలో ఈమెకు బ్రెయిన్ స్ట్రోక్ రావడం ఇది రెండోసారి. 2018లో ఈమెకు జాతీయ అవార్డు తీసుకొచ్చిన బాదాయి హో సినిమా షూటింగ్ సమయంలో తొలిసారి బ్రెయిన్ స్ట్రోక్ కు గురైంది. ఇప్పుడు రెండోసారి వచ్చింది. ఈమె వయసు 75 సంవత్సరాలు. సురేఖ త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు దేవున్ని ప్రార్థిస్తున్నారు

More Related Stories