English   

వెంకీ హిట్ ఇచ్చాడు.. నితిన్ కార్ ఇచ్చాడు.. లెక్క సరిపోయింది..

 Nithiin
2020-09-09 14:15:29

అప్పుడెప్పుడో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ..ఆ సినిమా తర్వాత మొన్న భీష్మ వచ్చే వరకు నితిన్ కు ఒక్క హిట్టు కూడా లేదు. మధ్యలో చాలా సినిమాలు చేశాడు. కాని ఒక్కటి కూడా వర్కవుట్ కాలేదు. దాంతో మళ్లీ ఫ్లాపుల్లోకి వెళ్ళిపోయాడు ఈ కుర్రహీరో. ఇలాంటి సమయంలో దర్శకుడు వెంకీ కుడుముల భీష్మ సినిమాలో నితిన్ కు అదిరిపోయే హిట్ ఇచ్చాడు. ఈ సినిమా నితిన్ కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్స్ (అ..ఆ కాకుండా) తీసుకొచ్చింది. త్రివిక్రమ్ మార్క్ ఎంటర్టైన్మెంట్తో భీష్మ నవ్వులతో పాటు సందేశం కూడా అందించింది. తనకు ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన దర్శకుడికి నితిన్ కూడా అదిరిపోయే బహుమతి ఇచ్చాడు. ఆయనకు రేంజ్ రోవర్ కారణం గిఫ్టుగా ఇచ్చాడు ఈ హీరో. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు దర్శకుడు వెంకీ కుడుముల. మనం ఒక మంచి విజయం అందించినప్పుడు తిరిగి అది మనకు ఓ మంచి గిఫ్ట్ రూపంలో వస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు వెంకీ. ఇంత మంచి బహుమతి ఇచ్చినందుకు థాంక్యూ అన్నా అంటూ నితిన్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు వెంకీ. మొత్తానికి దర్శకులకు బహుమతులు ఇచ్చే సంస్కృతి చాలా రోజుల నుంచి ఉంది. అప్పట్లో కొరటాల శివకు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ కాస్ట్లీ గిఫ్ట్ లు ఇచ్చారు. పూరి జగన్నాథ్ కూడా ఇలాంటి బహుమతులు అందుకున్నాడు. 

More Related Stories