English   

రియా చక్రవర్తికి బెయిలు నిరాకరించిన కోర్టు..

Rhea Chakraborty
2020-09-09 14:56:53

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రోజురోజుకూ కీలక మలుపులు తిరుగుతోంది. ఈయన మరణం నుంచి బాలీవుడ్ డ్రగ్స్ కేస్ వరకు చాలా విషయాల్లో ఈ కేసు ముందుకు వెళుతుంది. బాలీవుడ్లో మరో 25 మంది సెలబ్రిటీలు కూడా డ్రగ్స్ వాడుతున్నారు అంటూ రియా చక్రవర్తి విచారణలో బయట పడింది. దాంతో వాళ్లకు కూడా నోటీసులు పంపించడానికి సిద్ధమయ్యారు NCB. ఇదిలా ఉంటే ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు సీబీఐ ఇన్వెస్టిగేషన్‌లో రియాను నిందితురాలుగా చేర్చి విచారణ జరుపుతున్నారు. ఈ రెండు కేసులు మధ్యగా చక్రవర్తి నలిగిపోతుంది అంటూ కుటుంబ సభ్యులు కూడా ఆవేదన చెందుతున్నారు. NCB అరెస్టు తర్వాత కోర్టులో బెయిల్ కోసం అప్లై చేసుకుంది రియా చక్రవర్తి. కానీ ఈమె పెట్టుకున్న అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. కోర్టు బెయిల్ నిరాకరించడంతో 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించింది. ఇదిలా ఉంటే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్న చనిపోవడానికి రియా చక్రవర్తితో పాటు కుటుంబ సభ్యులు కూడా కారణమే అంటూ సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఆరోపించడంతో అదికారులు ఆ దిశగా విచారణ జరిపారు. ఇప్పటికే ఈ కేసులో రియా చక్రవర్తి సోదరుడు అరెస్ట్ అయ్యాడు. ఆయనతో పాటు రియా కూడా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు వాట్సాప్ లో తేలడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 

More Related Stories