English   

షూటింగ్ మొదలు పెట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు..

 Mahesh Babu
2020-09-09 15:09:49

దాదాపు ఎనిమిది నెలల తర్వాత మళ్లీ మొహానికి రంగు వేసుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదలైన తర్వాత మళ్ళీ ఇల్లు వదిలి బయటకి రాలేదు. మధ్యలో కరోనా వైరస్ కూడా రావడంతో ఇక పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోయాడు. పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా కమిట్ అయినా కూడా డిసెంబర్ తర్వాత ఆ సినిమా షూటింగ్ కు వస్తానని నిర్మాతలకు మహేష్ బాబు చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక షూటింగ్ లో కనిపించాడు. అయితే ఈ సినిమా మాత్రం కాదు.. కేవలం కమర్షియల్ యాడ్ మాత్రమే. దాని కోసం మళ్లీ మొహానికి మేకప్ వేసుకున్నాడు మహేష్. పూర్తిగా అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే ఈ షూటింగ్ మొదలుపెట్టారు. మేకప్ సిబ్బందితో పాటు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ పి పి ఈ కిట్లు కూడా ధరించారు. రెండు రోజుల్లో ఈ కమర్షియల్ పూర్తి చేయాలని చూస్తున్నాడు మహేష్ బాబు. ఇక సినిమాల విషయానికొస్తే ఇప్పట్లో ఆయన బయటకు వచ్చేలా కనిపించడం లేదు. సర్కారు వారి పాట సినిమా డిసెంబర్లోనే మొదలు కానుంది. అది కూడా అప్పటికి వైరస్ నియంత్రణలోకి వస్తేనే. లేదంటే మరికొన్ని రోజులు ఇంట్లోనే ఉండబోతున్నాడు మహేష్ బాబు. 

More Related Stories