English   

అక్షయ్ కుమార్ సొంత ఫ్లైట్ ఎన్ని వందల కోట్లు తెలుసా..

Akshay Kumar
2020-09-10 10:47:38

ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోల్లో అక్షయ్ కుమార్ కూడా ఉన్నాడు. ఒక్కో సినిమాకు దాదాపు 80 కోట్ల వరకు పారితోషికం అందుకుంటాడు. ఏడాదికి దాదాపు నాలుగు సినిమాలు చేస్తాడు. అన్నింటికి మించి కమర్షియల్ యాడ్స్, రియాలిటీ షోలు అదనం. ఇవన్నీ కలుపుకుంటే అక్షయ్ కుమార్ సంపాదన ఏడాదికి దాదాపు 500 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. అందుకే ఇండియాలో అత్యంత ధనిక హీరోల్లో ఆయన కూడా ఒకరు. ఈయన మెయింటినెన్స్ కూడా ఇలాగే ఉంటుంది. అక్షయ్ కుమార్ కు సొంతంగా ఒక ఫ్లైట్ ఉంది. ఈ విషయం తెలిసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. తన సినిమాల ప్రమోషన్ కోసం తన సొంత ఫ్లైట్ వాడుకుంటాడు అక్షయ్. దీని విలువ దాదాపు 260 కోట్లు ఉంటుందని అంచనా. దాన్ని మెయింటైన్ చూడడానికి కోట్లు ఖర్చు పెడుతున్నాడు అక్షయ్. తాజాగా తన స్నేహితుడు, దర్శకుడు ప్రభుదేవాతో సొంత ప్రైవేటు జెట్ లోంచి కిందకు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆయన నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు. రెండు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. లక్ష్మీబాంబ్ సినిమాతో పాటు సూర్య వంశీ కూడా రిలీజ్ కు ముస్తాబైంది. 

More Related Stories