ఐపీఎల్ కోసం వెయిట్ చేస్తున్న ఎస్పీ బాలసుబ్రమణ్యం..

అదేంటి.. హాస్పిటల్ బెడ్ పైన ఎస్పీ బాలసుబ్రమణ్యం ఐపీఎల్ కోసం వెయిట్ చేయడం ఏంటి అనుకుంటున్నారా. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు ఎస్పీ బాలు నిజంగానే ఐపీఎల్ సీజన్ కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నాడు. గత నెల రోజులుగా చెన్నై ఎంజీఎం హాస్పిటల్ లో కరోనా వైరస్ తో పోరాడుతున్న లెజెండరీ గాయకుడు ఈ మధ్యే కోలుకుంటున్నాడు. రోజు రోజుకి ఆయన ఆరోగ్యం మెరుగవుతుంది అంటూ తన తనయుడు ఎస్పీ చరణ్ వీడియోలో చెప్పాడు. అంతేకాదు ఆయన వైద్యానికి స్పందిస్తున్నారని.. తమను చూసి మాట్లాడుతున్నారని చెప్పాడు. అన్నింటికీ మించి ఆయనకు స్పృహ వచ్చిందని.. అందర్నీ గుర్తు పట్టి పలకరిస్తున్నాడని చెప్పాడు. ప్రస్తుతం ఆయన హాస్పిటల్ బెడ్ పైన ఉన్న కూడా తన ఐప్యాడ్ లో ఆయనకు ఎంతో ఇష్టమైన టెన్నిస్ తో పాటు క్రికెట్ కూడా చూస్తున్నాడని చెప్పాడు చరణ్. ఐపీఎల్ సీజన్ కోసం తన తండ్రి ఆసక్తిగా వేచి చూస్తున్నట్లు ప్రేక్షకులకు చెప్పాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగు పడుతుందని.. అందరి ఆశీస్సులు దీవెనలు ఫలించి త్వరలోనే ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మళ్ళీ తిరిగి అందరి మధ్యకు వస్తాడని చెప్పాడు చరణ్.