English   

కంగనకు సపోర్ట్ చేయడానికి కూడా భయపడుతున్న బాలీవుడ్ స్టార్స్..

 Bollywood
2020-09-10 17:01:05

ముంబైలో పెద్ద యుద్ధమే చేస్తుంది కంగన రనౌత్. ఈ పోరులో ఈమె ఒక్కతే ఒక సైడ్ ఉంటే.. మిగిలిన వాళ్లంతా మరో వైపు ఉన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయిన తర్వాత కంగన తీరులో కూడా మార్పు వచ్చింది. బాలీవుడ్ పూర్తిగా నెపోటిజమ్ తో నిండిపోయిందని.. ఇక్కడ బయటి వాళ్లు వస్తే చచ్చిపోవడం లేదంటే ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోవడం మాత్రమే చేయాల్సి వస్తుందని మండి పడింది. అసలు ఇక్కడ టాలెంట్ కంటే కూడా వారసత్వానికే అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయని ఆమె ఆరోపించింది. ముందు నుంచి కంగన చేస్తున్న కామెంట్స్ పై ఎవరో అక్కడక్కడా ఒకరిద్దరు అవుటర్స్ మాత్రమే సపోర్ట్ చేస్తూ వచ్చారు కానీ స్టార్స్ ఎవరూ స్పందించలేదు. 

సుశాంత్ లాంటి స్టార్ హీరో చనిపోతే కనీసం ఎవరూ చూడ్డానికి కూడా రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ తరుణంలో కంగన అందర్నీ భయపెడుతుంది. అసలు బాలీవుడ్ అంతా నెపోటిజమ్ కారణంగా దారుణంగా మారిపోయిందని ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈమె చేస్తున్న యుద్ధంలో ఒక్కరంటే ఒక్క బాలీవుడ్ స్టార్ కూడా నోరు మెదపడం లేదు. మాట్లాడితే ఎక్కడ తమ మీదికి ఈ టాపిక్ వస్తుందో అని భయపడుతున్నారు వాళ్లు. మనకెందుకు వచ్చిన గొడవరా బాబూ అంటూ నోరు మూసుకుని తమ పని తాము చేసుకుంటున్నారు. ఇదిలా సాగితే బాలీవుడ్ అంతా ఒక్కటే అనే పదం కూడా పోయి.. ఎవరికి వారు యమునకు తీరు అన్నట్లు మారిపోతుందేమో పరిస్థితి. 

More Related Stories