English   

బుజ్జిగాడు కూడా ఓటీటీలోనే 

Raj Tarun
2020-09-11 15:16:17

టాలీవుడ్ మూవీ మేకర్స్ ఎంతో ద్రుష్టి పెట్టే సీజన్ సంక్రాంతి. సినిమా చిన్నదయినా పెద్దదయినా సంక్రాంతికి రిలీజ్ చేస్తే మంచిదనే భావనలో ఉంటారు మన వాళ్ళు. ఆ సంక్రాంతి తర్వాత ఎక్కువ ద్రుష్టి పెట్టేది మాత్రం సమ్మర్ సీజన్ మీదే. పిల్లల సెలవలు ఉంటాయి కాబట్టి ఎక్కువగా సమ్మర్ మీద కూడా ఫోకస్ పెడుతుంటారు మేకర్స్. అయితే ఈ ఏడాది సమ్మర్ కి కరోన వచ్చి పడిన సంగతి తెలిసిందే. ఒక లైలా కోసం ఫేమ్ కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా వస్తున్న ఒరేయ్ బుజ్జిగా చిత్రం కూడా ఏప్రిల్ 3న విడుదల కావాల్సి ఉండగా కరోనా మహమ్మారి వచ్చి పడింది. ఈ కరోనా దెబ్బకు ధియేటర్స్ మూత బడి పోవడం తో చాలా సినిమాల చిత్రీకరణ పూర్తి అయినా, విడుదలకు నోచుకోవడం లేదు. అయితే దాదాపు ఆరు నెలల పాటుగా ధీయేటర్లు మూత పడటం నిర్మాతలకు మాత్రమే కాకుండా, సినీ పరిశ్రమ లో దాదాపు అందరికీ ఫైనాన్షియల్ గా కష్ట కాలం నడుస్తుంది. అయితే ఈ సమయం లోనే కొన్ని సినిమాలు ఓటీటీలలో విడుదల అవుతున్నాయి. ఇప్పుడు అదే దారిలో ఒరేయ్ బుజ్జి గా విడుదల అయ్యేందుకు సిద్దం అయిందని అంటున్నారు. రాదా మోహన్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాని ఆహా యాప్ కి అమ్మేసినట్టు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజు వెలువడనుంది. ఈ సినిమా అక్టోబర్ 2 న స్ట్రీమ్ కానున్నట్లు సమాచారం.  

More Related Stories