English   

రెహమాన్ మీద పన్ను ఎగవేత ఆరోపణలు.. కోర్టు నోటీస్ లు

 AR Rahman
2020-09-12 09:25:34

సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కి మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. అది కూడా ఇన్ కం టాక్స్ ఎగవేసిన కేసులో అని చెబుతున్నారు. రెహమాన్ కు సంబంధించిన ఒక ఛారిటబుల్ ట్రస్టు ద్వారా  మూడు కోట్లకు పైగా ఆదాయాన్ని పన్ను ఎగవేత ద్వారా సంపాదించారని అయన మీద కేసులు నమోదయ్యాయి. ఇంగ్లాండ్ కు చెందిన ఓ ప్రముఖ కంపెనీ నుంచి ఏ ఆర్ రెహమాన్ ఫౌండేషన్ తీసుకున్న 3.47 కోట్లకు సంబంధించి రెహమాన్ ఆదాయ పన్ను చెల్లించలేదని ఐటీ శాఖ గుర్తించింది. యూకే కి చెందిన ఒక టెలికాం సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న ఏ ఆర్ రెహమాన్, ఆ సంస్థకు ప్రత్యేకమైన రింగ్ టోన్ లను కంపోజ్ చేయడానికి 2011-12 వ సంవత్సరంలో 3.47 కోట్లు ఛార్జ్ చేశారు. అయితే పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని రెహమాన్ తాను నేరుగా స్వీకరించి, పన్ను చెల్లించి ఆ తర్వాత ట్రస్టుకు బదిలీ చెయ్యాల్సి ఉంటుంది. కానీ పన్ను చెల్లించకుండా ఉండేందుకు నేరుగా రెహమాన్ చారిటబుల్ ట్రస్ట్ కు ఆదాయాన్ని బదిలీ చేయాలని చెప్పి పన్ను ఎగవేశారని చెబుతున్నారు. ఛారిటబుల్ ట్రస్ట్ లకు వచ్చే ఆదాయాన్ని ఆదాయ పన్ను చట్టం కింద మినహాయింపు ఇస్తున్న కారణంగా రెహమాన్ ఈ పని చేసినట్లు ఆదాయ పన్ను శాఖ ఆరోపిస్తోంది. మరి దీని మీద రెహమాన్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

More Related Stories